కియారా 'బికినీ' సీన్ ఇష్యూ.. గట్టి కౌంటర్ తో మేకర్స్ క్లారిటీ!
బాలీవుడ్ కియారా అద్వానీ ఇటీవల ఆడబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉంది. తన కుమార్తెతో క్వాలిటీ టైమ్ ను గడుపుతోంది.
By: M Prashanth | 7 Aug 2025 10:56 AM ISTబాలీవుడ్ కియారా అద్వానీ ఇటీవల ఆడబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉంది. తన కుమార్తెతో క్వాలిటీ టైమ్ ను గడుపుతోంది. అదే సమయంలో ఆమె నటించిన వార్-2 మూవీ.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆమె గర్భవతి కావడం, ఆ తర్వాత తల్లి కావడంతో ప్రమోషన్స్ కు దూరంగా ఉంది.
కానీ కియారాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆమె బికినీ కంటెంట్ ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా బికినీలో ఇంత అందంగా కనిపించలేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు.
ఇప్పటికే కొన్ని సినిమాల్లో కియారా అందాలు ఆరోబోసినప్పటికీ.. వార్-2లో అంతకుమించి అని చెప్పారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు మాత్రం.. కియారా బికినీ అందాలకు కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (CGI) వర్క్ కారణమంటూ ఆరోపించారు. అది ఒరిజినల్ కాదు, సీజీఐతో చేశారని రూమర్స్ క్రియేట్ చేశారు.
దీంతో నెగిటివ్ ప్రచారం మొదలవ్వగా.. వార్-2 మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. రూమర్స్ క్రియేట్ చేసిన వారికి కౌంటర్ ఇస్తూ.. క్లారిటీ కూడా ఇచ్చారు. ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ.. కొత్త BTS (బిహైండ్ ది సీన్స్) వీడియోను రిలీజ్ చేశారు. దాని ద్వారా బికినీ షాట్స్ నిజంగా తీసినవని మేకర్స్ స్పష్టం చేశారు.
వీడియోలో కియారా బికినీ షాట్ కోసం ఎలా ప్రిపేర్ అయిందో చూపించారు. ఆమె ప్రాక్టీస్ తో పాటు షాట్ సెటప్ కు చెందిన విజువల్స్ కూడా యాడ్ చేశారు. అలా CGI వర్క్ కాదని సూటిగా సమాధానం ఇచ్చారు. దీంతో సీన్ కోసం కియారా ఎంత కష్టపడిందో క్లియర్ గా తెలుస్తోంది. మూవీకిగాను తన పాత్రకు న్యాయం చేసినట్లు కనిపిస్తోంది.
కాగా వార్-2 సినిమా విషయానికొస్తే.. కియారా ఫిమేల్ లీడ్ రోల్ లో నటించగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ పోషించారు. టాలీవుడ్ బడా హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఆ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానుంది. ఆగస్టు 14వ తేదీన విడుదల కానుంది.
