Begin typing your search above and press return to search.

ది ఆర్చీస్: ఖుషీ కపూర్ స్ట‌న్నింగ్ షో

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ క‌పూర్ మామ్ లెగ‌సీని ముందుకు న‌డిపించ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతోంది

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:52 AM GMT
ది ఆర్చీస్: ఖుషీ కపూర్ స్ట‌న్నింగ్ షో
X

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ క‌పూర్ మామ్ లెగ‌సీని ముందుకు న‌డిపించ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, సౌత్ లో ఘ‌న‌మైన డెబ్యూ ఇస్తూ జాన్వీ క‌పూర్ ఇటీవ‌ల చ‌ర్చ‌ల్లో వ్య‌క్తి అయింది. ఇంత‌లోనే త‌న సోద‌రి ఖుషీ కపూర్ కూడా న‌టిగా తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది.


జోయా అక్త‌ర్ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో ఖుషీ న‌టిగా ప‌రిచ‌య‌మ‌వుతోంది. త‌న సిరీస్ విడుదలకు ముందు, వర్ధమాన నటి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ భారీగా అభిమానులను సంపాదించుకుంది. చాలా మంది ప్రేమికులు, ఆరాధకులు ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ కొంద‌రి నుంచి ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే ఖుషీ కపూర్ ఇకపై సోషల్ మీడియా ట్రోలింగ్ తనపై ప్రభావం చూపలేదు అని తెలిపింది.

ఇటీవలి సంభాషణలో ఖుషీ కపూర్ సోషల్ మీడియా విష‌యంలో ఒక స్థిర‌మైన‌ విధానాన్ని అభివృద్ధి చేశానని, సామాజిక‌ వేదిక‌ల‌పై చదివిన ప్రతిదానికి ప్రభావితం కాను అని.. మునుపటి ఆలోచనా విధానం నుండి నిష్క్రమించాన‌ని తెలిపారు. దురదృష్టవశాత్తూ, నేను చాలా చిన్న వయస్సు నుండే చాలా బాహ్య‌మైన విష‌యాలతో స‌మ‌స్య‌ల‌కు గురయ్యానని అనుకుంటున్నాను.. కాబట్టి నేను చాలా వరకు డీసెన్సిటైజ్ అయ్యాను! అని ఖుషీ వ్యాఖ్యానించింది.

మ‌నం సోష‌ల్ మీడియాల్లో ఏదైనా చదివినప్పుడు అది వేరొకరి అభద్రతాభావం నుండి వచ్చినదా? అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు నేను దానిని అంతగా హార్ట్ లోకి తీసుకోకూడదని నేర్చుకున్నాను. నేను నిజంగా ప్రతిదాని గురించి ఆలోచించను. నేను మునుపటిలా ఎక్కువగా ఆలోచించను. చిన్నప్పటి నుండి చాలా చూడటం నాకు ఇప్పటి విష‌యాలను వేరు చేయడంలో సహాయపడింది. మంచి నుండి మేలు పుడుతుందని నాకు తెలుసు కాబట్టి, ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌ ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇస్తాను! అని అంది.

ది ఆర్చీస్ లో బెట్టీ కూపర్ పాత్రను పోషించ‌డం కూడా దయగా మంచిగా ఉండటాన్ని నేర్పిందని ఖుషీ తెలిపింది. . బెట్టీ స్వీటెస్ట్ గాళ్.. సున్నితమైన స్వభావం ఉన్న అమ్మాయి. ఖుషీ నిజ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి షూటింగ్ సమయంలో ఎలా ఉండాలో కూడా ఈ పాత్ర నేర్పింది అని తెలిపింది.

ప్రఖ్యాత అమెరికన్ కామిక్ బుక్ సిరీస్ ఆధారంగా జోయా అక్తర్ రూపొందించిన `ది ఆర్చీస్` నెట్ ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. తారాగణంలో సుహానా ఖాన్, ఖుషీ క‌పూర్, అగస్త్య నందా, వేదంగ్ రైనా, త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.