Begin typing your search above and press return to search.

భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న విజయ్​

పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ఎమోషన్స్ చుట్టూ కథను ముందుకు తీసుకెళ్లారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 10:46 AM GMT
భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న విజయ్​
X

సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ- స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్​ టైనర్​ సినిమా 'ఖుషి'. నిన్ను కోరి, మజిలీ ఫేమ్​ శివ నిర్వాణ డైరెక్ట్​ చేశారు. రీసెంట్​గా ఈ సినిమా షూటింగ్​ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్‌ 1న రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో జోరు పెంచిన మూవీటీమ్​.. తాజా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఓ ఈవెంట్​ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసి ప్రచార చిత్రాన్ని రిలీజే చేసింది.


'దీనమ్మ కాశ్మీర్. సేమ్ రోజా సినిమాలానే ఉంది' అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ ఆయన మాట్లాడిన సంభాషణలు కామెడీగా ఉన్నాయి. . 'మీ గురించి తెలియదు కానీ బేగమ్​ మాత్రం డైరెక్ట్ స్వర్గ్​ సే ఆయే హై' అంటూ సామ్​పై తన ప్రేమను తెలియజేయడం కూడా బాగుంది. అయితే ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది.

తాను బేగం కాదు.. బ్రాహ్మిణ్ అంటూ అసలు విషయాన్ని సమంత బయటపెడుతుంది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ సాఫీగా సాగిన జీవితంలో వచ్చే గొడవల నేపథ్యంలో ప్రచార చిత్రాన్ని చూపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ఎమోషన్స్ చుట్టూ కథను ముందుకు తీసుకెళ్లారు.

జాతకాల వల్ల విజయ్​-సమంత కుటంబంలోని వారు పెళ్లికి ఒప్పుకోకపోవడం, దీంతో వాళ్లని కాదని ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్​ చేసుకోని సాఫీగా జీవినం సాగించడం, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల గొడవలు ఎదురవ్వడం వంటివి బాగా చూపించారు.

ఈ క్రమంలోనే 'పెళ్లంటేనే చావురా' అని రాహుల్ రామకృష్ణ అనడం, భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా అని విజయ్ అనడం హైలైట్​గా నిలిచింది. చిన్నపాటి ఫైటింగ్ సీన్స్ కూడా చూపించారు. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మరి చివరికి వీరిద్దరూ కలిశారా లేదా అన్నది తెరపై చూడాల్సిందే..

ఇకపోతే శాకుంతలం వంటి డిజాస్టర్ తర్వాత సమంత, లైగర్ వంటి అట్టర్​ ఫ్లాప్​తో విజయ్​ దేవరకొండ, టక్ జగదీశ్ వంటి ఫ్లాప్​తో శివ నిర్వాణ్.. ఇలా​ ముగ్గురు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంతో ఈ ముగ్గురూ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఈ ముగ్గురికి ఖుషి ఎలాంటి సక్సెస్​ను అందిస్తుందో..