Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై ఖుషి కన్ను..?

ఈమధ్య తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు ఇక్కడ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత కూడా లభిస్తుంది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 3:15 AM GMT
టాలీవుడ్ పై ఖుషి కన్ను..?
X

శ్రీదేవి బోనీ కపూర్ తనయురాలు జాన్వీ కపూర్ తల్లి వారసత్వాన్ని అందుకుని హీరోయిన్ గా రాణిస్తుంది. శ్రీదేవికి సూపర్ క్రేజ్ తెచ్చిన సౌత్ సినిమాల మీద జాన్వి కపూర్ కూడా ఆసక్తి చూపిస్తుంది. బాలీవుడ్ లో దూసుకెళ్తున్న అమ్మడు లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కలిసి దేవర సినిమాలో నటిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ పాత్ర కూడా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. దేవర సినిమా తర్వాత జాన్వీ కపూర్ వరుసగా తెలుగు సినిమాల్లో నటించాలని అనుకుంటుంది.

అయితే అక్క జాన్వీ కపూర్ కన్నా చెల్లి ఖుషి కపూర్ స్పీడ్ మీద ఉంది. తను లాస్ట్ ఇయరే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వగా అప్పుడే సౌత్ సినిమాల మీద కన్నేసింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషికి బాలీవుడ్ కన్నా సౌత్ సినిమాల మీదే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే అమ్మడు అక్కడ కన్నా తెలుగు, తమిళ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. హిందీలో ఈ మధ్యనే కెరీర్ మొదలు పెట్టిన ఖుషి టాలీవుడ్ ఆఫర్ లు ఉంటే చూడండని చెబుతుందట.

ఈమధ్య తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు ఇక్కడ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత కూడా లభిస్తుంది. అందుకే ఖుషి కపూర్ తెలుగు, తమిళ్ ఆఫర్లు వస్తే చేయాలని అంటుంది. ఖుషి కపూర్ దూకుడు చూస్తుంటే అక్కడ జాన్వీ కపూర్ కన్నా ముందే తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది.

జాన్వీ కపూర్ తారక్ తో తెలుగు ఎంట్రీ ఇస్తుంది కాబట్టి ఖుషి కపూర్ కూడా మరో స్టార్ హీరో సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అవ్వాలని చూస్తుంది. ఎలాగు బ్యాక్ ఎండ్ లో బోనీ కపూర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఖుషికి ఆఫర్ రావడంలో కష్టపడాల్సిన అవసరం ఉండదు. మొదటి ఆఫర్ రావడం కాదు వచ్చిన ఆ ఛాన్స్ ని ఎలా వాడుకుంది అన్నది చూడాలి.

ఏది ఏమైనా తెలుగు సినిమాల్లో నటించాలని జాన్వి కన్నా ఖుషి కపూర్ కి ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. కచ్చితంగా ఇక్కడ ఖుషి కపూర్ సక్సెస్ అయితే కనుక మళ్లీ శ్రీదేవి రేంజ్ లో అమ్మడు క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు దేవరతో జాన్వి కూడా తన మార్క్ చాటాలని చూస్తుండగా ఆమె దారిలోనే ఖుషి కూడా తెలుగులో అదరగొట్టాలని ఫిక్స్ అయ్యింది.