ఊర్వశి రౌతేలా తర్వాత క్రికెటర్ మెసేజ్ చేసాడంటూ మరో నటి..!
టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంథ్ తో ఊర్వశి రౌతేలా ప్రేమకలాపం గురించి తెలిసిందే.
By: Sivaji Kontham | 31 Dec 2025 10:00 AM ISTటీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంథ్ తో ఊర్వశి రౌతేలా ప్రేమకలాపం గురించి తెలిసిందే. ఊర్వశి తాను ఉన్న హోటల్ గది బయట రిషబ్ చాలా సేపు తన కోసం ఎదురు చూసేవాడని బహిరంగంగా వ్యాఖ్యానించడంతో అది కాస్తా దుమారం రేపింది. ఆ తర్వాత రిషబ్ ఊర్వశిపై విరుచుకుపడ్డాడు. ఆ ఇద్దరి మధ్యా చాలా ఎపిసోడ్స్ మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాయి. ఆ తర్వాత ఊర్వశిపై చాలా మీమ్స్, కామెంట్లు సందడి చేసాయి. రిషబ్ అభిమానులు ఆడుకున్నారు.
ఇప్పుడు మరో నటి ప్రముఖ క్రికెటర్‌పై ఇలాంటి కామెంట్లు చేయడంతో అతడి ఫ్యాన్స్ ఒక రేంజులో ఆడుకుంటున్నారు. అంతగా బయటి ప్రపంచానికి తెలియని నటి ఖుషీ ముఖర్జీ ఈ సంవత్సరం బహిరంగ ప్రదేశాల్లో ధరించిన బోల్డ్ దుస్తుల కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ బో*ల్డ్ బ్యూటీ వీడియోలు వైరల్ అయ్యాయి. తీవ్రంగా ట్రోలింగ్ కి గురైంది. ఇప్పుడు ఓ రెడ్ కార్పెట్ ఈవెంట్లో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తనకు చాలా మెసేజ్‌లు పంపేవారని వ్యాఖ్యానించడం వేడెక్కించింది.
రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తున్న ఖుషీని మీకు ఏ క్రికెటర్ అంటే ఇష్టం? మీరు ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అని హోస్ట్ ప్రశ్నించగా, ``నేను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్ చేయాలనుకోవడం లేదని, చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారని అన్నారు. ఆ క్రికెటర్ .. సూర్యకుమార్ యాదవ్ నాకు చాలా మెసేజ్‌లు పంపేవారు.. కానీ ఇప్పుడు మా మధ్య పెద్దగా మాటల్లేవ్ అని కూడా అన్నారు. నాకు ఎవరితోను ఎఫైర్లు లేవు.. ఎలాంటి లింక్-అప్‌లు ఇష్టం లేదు! అని ఖుషీ చెప్పింది.
సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్‌లు పంపేవారని బహిరంగంగా ప్రకటించిన ఖుషీపై సూర్య కుమార్ అభిమానులు కామెడీలు చేయడం ప్రారంభించారు. ఒక నెటిజన్ ``అది కచ్చితంగా సూర్య ఫేక్ ఐడీ నుండి వచ్చిన మెసేజ్ అయి ఉంటుంది`` అని కామెంట్ చేశాడు. మరొకరు ``అవును నాకు తెలుసు.. అతను మా ఆఫీసులో సెక్యూరిటీ బోయ్ యాదవ్ అన్నయ్య.. అతడే ఆమెకు మెసేజ్ చేసేవాడు`` అని రాశాడు. ఇంకొక నెటిజన్ ``సూర్య ఈమెకు మెసేజ్ చేస్తాడా? అతడికి అంత చెడ్డ రోజులు రాలేదు`` అని కామెంట్ చేశాడు.
సూర్య తనకు చాలా మెసేజ్‌లు పంపేవారనే ఖుషీ వాదనలపై సూర్య ఇంకా స్పందించలేదు. ఆమె ఈ కామెంట్ చేసే సమయంలో సూర్య కుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి తిరుమలేశుని సందర్శనంలో ఉన్నారు. 2016లో దేవిషా శెట్టిని సూర్య కుమార్ పెళ్లాడాడు.
ఖుషీ ముఖర్జీ ఎవరు? అంటే..ఆమె ఒక సాధారణ నటి.. కొన్ని తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా 10, లవ్ స్కూల్ 3 వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. బాల్‌వీర్ రిటర్న్స్ అనే టీవీ షోలో కీలక పాత్ర పోషించింది. ఈ నటి కొన్ని ఓటీటీ సిరీస్‌లలో కూడా కనిపించింది. ఊర్వశి రౌతేలా తర్వాత ఒక క్రికెటర్ పేరును ఉపయోగించుకోవడం ద్వారా ఫేమస్ అవ్వాలనుకుంటోంది అంటూ చాలా మంది నెటిజనులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
