Begin typing your search above and press return to search.

చెత్త డ్రస్‌ విమర్శలకు నటి వివరణ

సోషల్‌ మీడియాలో పాపులర్ కావడానికి ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 12:29 PM IST
చెత్త డ్రస్‌ విమర్శలకు నటి వివరణ
X

సోషల్‌ మీడియాలో పాపులర్ కావడానికి ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు పబ్లిసిటీ కావాలని విభిన్నమైన డ్రస్‌లు ధరిస్తే, కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇటీవల బుల్లితెర ద్వారా సుపరిచితం అయిన ఖుషి ముఖర్జీ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. పలు టీవీ షోలతో గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అమ్మడు మరింతగా పాపులారిటీ సొంతం కావాలని సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక కార్యక్రమంకు హాజరు అయిన సమయంలో ఈమె ధరించిన డ్రస్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి చెత్త డ్రస్‌ ఎలా ధరించారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.


కారు దిగి నడుస్తున్న సమయంలో ఆమె డ్రస్‌ తో ఇబ్బంది పడ్డట్లు క్లీయర్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆమె పాయింట్‌ ధరించలేదు, కనీసం చెడ్డీ ధరించలేదు అంటూ చాలా మంది తీవ్ర పదజాలంతో విమర్శించారు. పాపులర్‌ కావాలంటే ఇలాంటి పనులు చేయాలా అంటూ ప్రశ్నించిన వారు చాలా మంది ఉన్నారు. ఆమె తీరును చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. చెడ్డీ లేకుండా ఇలా రోడ్డు మీదకు వస్తారా అంటూ ఒక వ్యక్తి చేసిన కామెంట్‌కు ఖుషి ముఖర్జీ తీవ్రంగా స్పందించింది. తనకు పద్దతులు నేర్పించాల్సిన అవసరం లేదని, తాను అన్ని విధాలుగా ఉండాల్సిన విధంగానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.

ఖుషి ముఖర్జీ మాట్లాడుతూ... నేను ట్రాన్స్‌పరెంట్‌ ప్యాంట్ ధరించి ఉన్నాను. అయినా నేను చడ్డీ వేసుకున్నానో లేదో నువ్వు ఎలా చెప్పగలవు. చడ్డీ లేకుండా ఎవరూ బయటకు రారు. ఆ విషయం నీకు తెలియదా.. నేను థాంగ్స్ వేసుకున్నాను. దాని పట్టి పైకి లాగడం వల్ల అది కనిపించడం లేదు. అంతే తప్ప నేను మొత్తానికి వేసుకోలేదని మీరు ఎలా అంటారు. చాలా మంది నేను చాలా అసౌకర్యంగా ఫీల్‌ అయినట్లు ఉన్నాను అంటున్నారు. నా సౌకర్యం గురించి మీకు ఎలా తెలుస్తుంది. నాకు అసౌకర్యం అనిపిస్తే అసలు అలాంటి డ్రస్ వేసుకోను. నాకు కంఫర్ట్‌ ఉండటం వల్లే ఆ డ్రస్ ధరించాను అంది. నా శరీరం ఎంత వరకు చూపించాలో నాకు బాగా తెలుసు అంది.

ఆమె వివరణపై కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వివాదం ఒకటి జరుగుతుందని ముందే ఆమెకు తెలుసు. దానికి ముందస్తుగానే ప్రిపేర్‌ అయ్యి ఉందని మళ్లీ ట్రోల్‌ చేస్తున్నారు. మొత్తానికి ఖుషి ముఖర్జీ అనుకున్నట్లుగానే సోషల్‌ మీడియాలో ఆమెకు పాపులారిటీ దక్కింది, ఆమె గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దాంతో బిగ్‌ బాస్ వంటి షో ల్లో ఆమెకు ఎంట్రీ లభిస్తుందని కొందరు అంటున్నారు.

మొత్తానికి గత రెండు రోజులుగా ఖుషి ముఖర్జీ వ్యవహారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తద్వారా అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది. ముందు ముందు ఈమెను ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఇలా చేస్తారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఖుషి ముఖర్జీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఇలాంటివి కొన్ని సార్లు తప్పదు అంటున్నారు.