డేటింగ్‌ని కన్ఫామ్ చేసిన యువనటి?
ఖుషీ కపూర్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వరుస ఫోటోలను షేర్ చేసింది. వీటిలో మొదటి ఫోటో అద్దం సెల్ఫీ, దీనిలో ఖుషీ సిగ్నేచర్ స్టైల్ లో సున్నితమైన చిరునవ్వుతో కనిపించింది.
By: Tupaki Desk | 16 April 2025 11:50 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ 2023లో నెట్‌ఫ్లిక్స్ చిత్రం `ది ఆర్చీస్`తో వేదంగ్ రైనాతో కలిసి నటనా రంగ ప్రవేశం చేశారు. ఖుషీ బెట్టీ కూపర్ పాత్రను పోషించగా, వేదంగ్ రెగ్గీ మాంటిల్ పాత్రను పోషించాడు. ఆ చిత్రంలో వారు కలిసి నటించినప్పటి నుండి డేటింగ్ చేస్తున్నారని పుకార్లు షికార్ చేసాయి. ఇద్దరూ తమ సంబంధాన్ని ఎప్పుడూ ధృవీకరించకపోయినా చాలాసార్లు కలిసి కనిపించడం, వారి సాన్నిహిత్యం చూసి అభిమానులు వారు డేటింగ్ చేస్తున్నారని ఊహించుకున్నారు. ఇంతకాలం ఇది అధికారికం కాదు. కానీ వారు చివరకు పుకార్లను నిజం చేస్తున్నారని, తమ డేటింగ్ ని అధికారికం చేస్తున్నట్లు సింప్టమ్స్ కనిపిస్తున్నాయని చెబుతున్నారు. నెటిజనులు అక్క జాన్వి కపూర్‌ను అనుసరిస్తోందని దీనిపై అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఖుషీ కపూర్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వరుస ఫోటోలను షేర్ చేసింది. వీటిలో మొదటి ఫోటో అద్దం సెల్ఫీ, దీనిలో ఖుషీ సిగ్నేచర్ స్టైల్ లో సున్నితమైన చిరునవ్వుతో కనిపించింది. కానీ తన మెడలో యాక్సెసరీస్ నెటిజనుల దృష్టిని ఆకర్షించాయి. ఖుషీ తన మెడలో సున్నితమైన బంగారు గొలుసును ధరించింది.
ఆ గొలుసులో V , K అనే అక్షరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మధ్యలో హార్ట్ సింబల్ ఉంది. ఇది చూడగానే వి- అంటే వేదాంగ్ అని.. కే అంటే ఖుషీ అని, మధ్యలో సింబల్ మీనింగ్ లవ్ లో ఉన్నారని.. విశ్లేషిస్తున్నారు. అతడిపై ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్ ని ఎంపిక చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటు మరో రెండు ఫోటోల్లోను ఖుషి లుక్ అందరినీ ఆకర్షించింది.
ఖుషీ సోదరి జాన్వీ కపూర్ గత సంవత్సరం తండ్రి బోనీ కపూర్ చిత్రం `మైదాన్` ప్రీమియర్‌లో తన ప్రియుడు శిఖర్ పహరియాను సూచిస్తూ `షికు` అనే పేరున్న నెక్లెస్‌ను ధరించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఖుషీ కూడా తన సోదరిని అనుసరిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఖుషి ఇటీవల లవ్ యాపా, నాదనియాన్ అనే రెండు చిత్రాల్లో నటించింది. ఇవి రెండూ నిరాశపరిచాయి. మరోవైపు, వేదంగ్ రైనా ఇంతియాజ్ అలీ తదుపరి పీరియాడికల్ చిత్రంలో నటించాల్సి ఉంది. దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శార్వరి వాఘ్‌లతో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నాడు.
