ట్రెడిషనల్ లుక్‌లో ఖుషీ మతి చెడే అందం
ఖుషి చీరలో ఎంతో అందంగా ఉందని ఒకరు ప్రశంసిస్తే..చీరకట్టు అయినా, డిజైనర్ ఫ్రాక్ అయినా ఖుషీ దానిని ఎంతో అందంగా ప్రెజెంట్ చేస్తుందని ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చారు.
By: Tupaki Desk | 13 April 2025 5:00 AM ISTఖుషి కపూర్ పరిచయం అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి రెండో కుమార్తె. ఇటీవల `ది ఆర్చీస్` వెబ్ సిరీస్ తర్వాత రెండు వరస చిత్రాల్లో నటించింది. జునైద్ ఖాన్ తో `లవ్ యాపా` డిజాస్టర్ అయిన తర్వాత ఇబ్రహీం అలీఖాన్ సరసన `నాదనియాన్` అనే మరో చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. వరుస వైఫల్యాలు ఖుషీకి బ్యాడ్ నేమ్ తెచ్చాయి.
ఇదిలా ఉంటే, ఖుషి కపూర్ సోషల్ మీడియాలో చెలరేగి ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానుల్లో హాట్ టాపిగ్గా మారుతోంది. తాజాగా ఖుషీ మ్యానిఫెస్ట్ అనే మ్యాగజైన్ కవర్ షూట్ కోసం అదిరిపోయే ఫోజులిచ్చింది.
చీరలో రకరకాల డిజైనర్ దుస్తుల్లో ఖుషీ అందాలను ఆరబోసిన తీరు ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
ఖుషీ స్టన్నింగ్ అవతార్‌కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఖుషి చీరలో ఎంతో అందంగా ఉందని ఒకరు ప్రశంసిస్తే..చీరకట్టు అయినా, డిజైనర్ ఫ్రాక్ అయినా ఖుషీ దానిని ఎంతో అందంగా ప్రెజెంట్ చేస్తుందని ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చారు.
రెండు వరుస ఫ్లాపుల తర్వాత ఖుషీ నెక్ట్స్ ఏంటి? అన్నది ఆసక్తిగా మారింది. ఈ డెబ్యూ నటి లుక్స్ పరంగా కూడా అంతంత మాత్రమేనని విమర్శలున్నాయి. మునుముందు ఫేట్ ఏం డిసైడ్ చేస్తుందో వేచి చూడాలి.
