ఫోటో స్టోరి: వేసవి మంటలు ఒంట్లో
ఖుషీ కపూర్ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్స్ ని ఫుల్ గా ఆస్వాధిస్తోంది. ఇటీవల తన వెకేషన్ డంప్ నుండి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.
By: Tupaki Desk | 7 April 2025 9:29 AM ISTనేటితరం ఫ్యాషనిస్టాగా జాన్వీ కపూర్ వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల తన సోదరి జాన్వీకి పోటీగా ఖుషి కపూర్ వరస ఫోటోషూట్లతో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ఖుషి కపూర్ నిరంతరం బాడీకాన్ దుస్తుల్లో హొయలు పోతూ వేడి పెంచుతోంది. ఇప్పుడు ఖుషీ కపూర్ స్టైలిష్ బ్లూ బాడీకాన్ డ్రెస్ లో వేసవికి స్వాగతం పలికింది.
ఖుషీ కపూర్ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్స్ ని ఫుల్ గా ఆస్వాధిస్తోంది. ఇటీవల తన వెకేషన్ డంప్ నుండి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. వీటిలో ట్రావెల్ ఫ్యాషన్ లుక్స్ ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఒక ఫోటోగ్రాఫ్ లో ఖుషీ నీలిరంగు డెనిమ్ బాడీకాన్ ప్రింటెడ్ డ్రెస్ ధరించి కనిపించింది. అది లేత నీలం రంగులో ఫ్లోరల్ డీటెయిలింగ్ తో ఆకర్షిస్తోంది. ఆ డ్రెస్ లో స్వీట్ హార్ట్ నెక్ లైన్- థై స్లిట్ ప్రధాన ఆకర్షణ. ఇది ఖుషి లుక్ కు మరింత క్లాస్ అప్పీల్‌ని జోడించింది. ఖుషి తన లుక్ ని గోల్డ్ కలర్ చెవిపోగులు, బంగారు చోకర్, వాచ్, సన్ గ్లాసెస్, మ్యాచింగ్ డియోర్ హ్యాండ్ బ్యాగ్ వంటి యాక్ససరీస్‌తో అందంగా ప్రిపేర్ చేసింది. ఖుషీ తన సిగ్నేచర్ గ్లామ్ మేకప్ లుక్ తో గుబులు పెంచుతోంది. ఆ బుగ్గలపై రోసీ హైలైటర్, బ్లష్, కాంటూర్, విస్పీ కనురెప్పలు, మస్కారా పూసిన కళ్ళు, గోధుమ రంగు లిప్స్, ఓపెన్ హెయిర్ తో స్టార్ కిడ్ ఎప్పటిలాగే అందంగా కనిపించింది.
ఖుషి కపూర్ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో నటిగా పరిచయమైంది. ఇటీవలే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన `లవ్ యాపా` అనే చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది. అటుపై సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం సరసన `నాదనియాన్` అనే చిత్రంలో నటించింది. ఈ మూడు ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఖుషిలోని గ్లామర్ యాంగిల్ కి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ బ్యూటీ నిరంతరం సోషల్ మీడియాల్లో అభిమానులకు టచ్ లో ఉంది. ఖుషి కపూర్ తదుపరి సినిమా గురించి అప్ డేట్ తెలియాల్సి ఉంది.
