ఆ లిప్‌స్టిక్ మరకలు ఎవరివి? ఆమె లేక అతడు?
ఖుషి- వేదాంగ్ జంట ఏడాది కాలంగా డేటింగ్ లో ఉంది. ఆ ఇద్దరి ఔటింగులు, విదేశీ షికార్ల గురించి ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 12 Jun 2025 10:27 PM ISTఅతడి బుగ్గలు పెదవులు నుదిటిపై ఎర్రటి లిప్ స్టిక్ మరకలు.. అతడి చుట్టూ వేరే ఎవరూ లేరు. ఒకరు ఖుషి కపూర్.. మరొకరు ఒర్రీ అలియాస్ అవ్రతమణి.. ఆ ఇద్దరే అక్కడ ఉన్నారు. అయితే ఆ లిప్ స్టిక్ మరకలు ఎవరివో ఎలా తెలుస్తుంది? ఇంతకీ అతడిని ముద్దాడింది ఎవరు? అంటే.. ఖుషి తాను మాత్రం ఆ పని చేయలేదనే అంటోంది.
అందరి సందేహం ఒర్రీపైనే! అతడి వాలకం చూస్తుంటే అలాంటి చిలిపి పని చేసి ఉంటాడు. అసలింతకీ ఒర్రీ ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా? పార్టీలు, పబ్బుల్లో సెలబ్రిటీలు, అందమైన కథానాయికలు కనిపించినప్పుడు ఒకరకమైన వింతైన భంగిమతో వారిని హత్తుకుంటాడు. అతడి చేతులను అవతలి వ్యక్తి భుజాల మీది నుంచి వేస్తూ ఎగా దిగా చూస్తాడు. అందువల్ల ఒర్రీని వేరే రకంగా ఊహించుకుంటారు!
ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఒర్రీ చాలా దూరం వెళ్లినట్టున్నాడు! అసలింతకీ ఖుషి ప్రియుడు వేదాంగ్ రైనా బుగ్గలపైనా నుదిటిపైనా లిప్స్ పైనా ముద్దులు పెట్టుకున్నది ఎవరు? ఈ సందేహాలన్నిటికీ సమాధానం కావాలంటే ఈ వీడియో చూడాలి. ఖుషి నేనైతే ఆ పని చేయలేదని అంటోంది. ఒర్రీ మాత్రం సందేహంగా చూస్తున్నాడు. అందువల్ల అందరి డౌట్లు అతడిపైనే. ఈ వీడియోని సరదా పరిహాసం అనాలా? లేక ఒర్రీపైనే డౌట్ పడాలా? ఏదో ఒకటి తొందరగా తేల్చండి!
ఖుషి- వేదాంగ్ జంట ఏడాది కాలంగా డేటింగ్ లో ఉంది. ఆ ఇద్దరి ఔటింగులు, విదేశీ షికార్ల గురించి ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వీకపూర్ అధికారికంగా శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తోంది. తన సోదరి ఖుషి కపూర్ కూడా వేదాంగ్ రైనాపై ప్రేమను దాచుకోవడం లేదు. బర్త్ డే పార్టీలు, ఫ్రెండ్స్ తో షికార్లు అంటూ చాలా జాలీగా గడిపేస్తోంది ఈ జంట. ఓవైపు సినిమాలు, మరోవైపు పార్టీలు.. సెలబ్రిటీ కల్చర్ లోతుల్లో సరిగమల్ని ఆస్వాధిస్తున్నారు.
