వారి ప్రేమ లేఖలు నేను ఇచ్చేదాన్ని..!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి కపూర్ తన బాల్యం, స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుంది.
By: Tupaki Desk | 15 April 2025 11:00 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాగా వేసింది. బాలీవుడ్‌లో హిట్స్ పడకున్నా గుర్తింపు దక్కించుకుంది. ఏడాదికి రెండు సినిమాలకు తగ్గకుండా హిందీలో సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో వెంటనే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో 'పెద్ది' సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే.
పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న జాన్వీ కపూర్ తాజాగా అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీలోనూ నటించే అవకాశాలు దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. ఒక వైపు అక్క జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకు పోతుంటే ఖుషి కపూర్ మాత్రం మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీలో అడుగులు వేస్తూ వస్తోంది. ఈమధ్య కాలంలో హిందీలో ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల అయ్యాయి. ఆ సినిమాలు పెద్దగా అలరించక పోవడంతో కెరీర్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఖుషి కపూర్ మాత్రం తన కెరీర్‌పై నమ్మకంతో ముందుకు సాగుతుంది. తప్పకుండా ముందు ముందు తన నుంచి పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు వస్తాయని హామీ ఇస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి కపూర్ తన బాల్యం, స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను డీ గ్లామర్‌గా ఉండటం వల్ల చాలా మంది ఎగతాళి చేసేవారు అంది. అంతే కాకుండా చాలా మందికి సంబంధించిన ప్రేమ లేఖలను నేను ఇచ్చేదాన్ని. ప్రేమికుల మధ్య నన్ను వారధిగా వాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది ప్రేమికుల మధ్య ప్రేమ లేఖలను ఇచ్చి పుచ్చుకోవడం నా ద్వారా జరిగేది. నన్ను మాత్రం అందంగా లేవు అని ఎగతాళి చేసేవారు. ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకునే దాన్ని కాదు. నాకు నేనుగా సొంతంగానే కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాను అన్నారు.
ఖుషి కపూర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో కొత్త సినిమాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తండ్రి బోనీ కపూర్ బ్యానర్‌లో ఖుషి కపూర్ ఒక సినిమా చేయబోతున్నాడట. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ బ్యానర్‌లోనూ ఖుషి కపూర్‌కి ఒక సినిమా ఛాన్స్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్ మాదిరిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ రాణించేందుకు ఈమె ఆసక్తిగా ఉంది. మరి తెలుగు, తమిళ్‌లో ఈమెకు పిలిచి ఆఫర్లు ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారా అనేది చూడాలి.
