పిక్‌టాక్ : మరో బాంబ్ పేల్చిన ఖుషి కపూర్
తాజాగా బ్లాక్ టాప్, బ్లూ పాయింట్‌తో కన్నుల విందు చేసి వైరల్ అయింది.
By: Tupaki Desk | 12 April 2025 10:00 PM ISTదివంగత నటి శ్రీదేవి నట వారసురాలుగా జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. అయితే హిందీలో ఇన్నాళ్లు దక్కని హిట్ ఎట్టకేలకు దేవర సినిమాతో దక్కిన విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడీగా పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఫుల్ డిమాండ్ ఉంది. కానీ జాన్వీ కపూర్ మాత్రం బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి కనబర్చుతోంది. చరణ్, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో హిందీలోనూ వారికి మార్కెట్ ఉన్న కారణంగా ఆ సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుంది.
ఒక వైపు జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకు పోతుంటే ఖుషి కపూర్ మాత్రం ఇండస్ట్రీలో ఎంట్రి ఇచ్చి బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 2023లో ది ఆర్చీస్‌తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అందులో ఖుషి కపూర్ పాత్రకు ప్రాముఖ్యత దక్కినప్పటికీ నటనతో అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో స్టార్ కిడ్ కావడం వల్ల ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో అక్క మాదిరిగా సినిమాలు చేయాలని ఖుషి కపూర్ ప్రయత్నాలు చేస్తోందట. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఖుషి కపూర్‌కి పెద్దగా సిగ్నల్ రావడం లేదని తెలుస్తోంది. హిందీలో ఈమె ఇటీవల నటించిన లవ్ యాపా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
లవ్ యాపాతోనూ మరోసారి ఫెయిల్ అయిన ఖుషి కపూర్ సోషల్ మీడియాలో మాత్రం అందమైన ఫోటోలతో అలరిస్తూ వస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, స్టైలిష్ ఔట్ ఫిట్స్ కారణంగా ఖుషి కపూర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ఖుషి కపూర్ తన అందమైన ఫోటోల కారణంగా వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు రెండు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ ఖుషి కపూర్ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తరహాలోనే వైరల్ అవుతూ ఉంది. తాజాగా బ్లాక్ టాప్, బ్లూ పాయింట్‌తో కన్నుల విందు చేసి వైరల్ అయింది.
తండ్రి ప్రముఖ నిర్మాత అయినప్పటికీ ఖుషి కపూర్ కష్టపడి ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ఇటీవలే బోనీ కపూర్ తన చిన్న కూతురు ఖుషి కపూర్ కోసం ఒక సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. 2019లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందిన ఖుషి కపూర్, ఫిల్మ్ మేకింగ్‌లోనూ ప్రావిణ్యం సొంతం చేసుకుంది. పలు సినిమాలకు ఖుషి కపూర్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసింది. నటిగానే కాకుండా టెక్నీషియన్‌గానూ ఖుషి కపూర్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
