అందం కోసం శస్త్ర చికిత్సలు చేయించుకున్నా: ఖుషి
అందం పెంచే శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు నటీమణులు వెనకాడటం లేదు.
By: Tupaki Desk | 19 July 2025 9:00 AM ISTఅందం పెంచే శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు నటీమణులు వెనకాడటం లేదు. నాటి మేటి కథానాయిక శ్రీదేవి మొదలు నేటితరం నటీమణుల్లో చాలా మంది తమ అందాన్ని పెంచుకునేందుకు అవసరమైన సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు శ్రీదేవి నటవారసురాలు ఖుషీ కపూర్ కూడా దీనిపై నిజాయితీగా మాట్లాడటం ఆకర్షించింది. తాను అందం పెంచుకునేందుకు, మరింత ఉత్తమంగా కనిపించేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకున్నానని ఖుషి నిజాయితీగా అంగీకరించింది.
నేను ఏం చేసానో దానిని నిజాయితీగా ఒప్పుకుంటాను... బహిరంగంగా మాట్లాడతాను! అని చెప్పింది ఖుషి. ఎవరైనా ఏదైనా చేయాలి అనుకుంటే, అది వారి ఇష్టం. తమకు సూటయ్యేది చేయాలి అని కూడా ఖుషీ పేర్కొంది. అందం అవాస్తవంగా ఉంటే దాని ప్రభావం యువతరంపై పడుతుంది. నేను ఇంత అందంగా ఎందుకు కనిపించడం లేదు! అని కూడా కలత చెందుతారు.. అని ఖుషీ పేర్కొంది.
అయినా ప్రజలంతా ప్లాస్టిక్ సర్జనీ అని పిలుస్తారనే భయం.. నేను దేనినీ పట్టించుకోను.. అదేమంత పెద్ద విషయం కాదు అని కూడా ఖుషీ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్లాస్టిక్ సర్జనీ అనే పదం అవమానం. బయటకు వస్తే ద్వేషిస్తారని భయపడతారు.. కానీ ఇదేమీ తప్పు కాదని నేను భావిస్తాను అని ఖుషీ పేర్కొంది.
అయితే సర్జరీలు అన్ని సమయాల్లో అందరికీ వర్కవుట్ కావు. అందం పెంచే మందుల తోను ప్రమాదం ఉందని ఇటీవలే అకస్మాత్తుగా మరణించిన నటి షెఫాలి జరివాలా ఉదంతం వెల్లడించింది.
