ఆల్మోస్ట్ ఒళ్లు దాచుకోకుండా బికినీలో స్టార్ కిడ్
ప్రస్తుతం ఖుషీ ధరించిన స్పెషల్ బికినీ యూత్ లో హాట్ టాపిగ్గా మారింది. సింపుల్ గా బికినీలో జలకాలాటలకు సిద్ధమైన ఖుషీ తన స్నేహితుడు ఓర్రీతోను సెల్ఫీలు దిగింది.
By: Tupaki Desk | 17 May 2025 9:00 PM ISTబీచ్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేయాలంటే కపూర్ సిస్టర్స్ తర్వాతే. జాన్వీకపూర్- ఖుషి కపూర్ ప్రతియేటా సీజన్‌కి అతీతంగా మాల్దీవుల విహారయాత్రల్లో అభిమానులకు వేడెక్కించే ట్రీట్ ప్లాన్ చేస్తారు. ఈసారి వేసవికి ఖుషికపూర్ తన స్నేహితుడు ఒర్రీతో కలిసి బీచ్ వెకేషన్ లో సందడి చేస్తున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
ఈ యాత్ర ఏ బీచ్ నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు. బహుశా ఇది మాల్దీవులు కావొచ్చు.. లేదా గోవాలో అయినా కావొచ్చు. ఆసక్తికరంగా బీచ్ వెకేషన్ నుంచి వచ్చిన తాజా పోటోషూట్ లో ఖుషి కపూర్ ఆల్మోస్ట్ అర్థనగ్నంగా బికినీలో కనిపించి షాకిచ్చింది. ఖుషీ చాలా పరిమితంగా పేలికల వంటి బ్లాక్ బికినీ ధరించి కనిపించింది. నిజానికి ఇది ఖుషీలో రెబలిజాన్ని ఆవిష్కరిస్తోంది. ఇంతకుముందు జాన్వీ కపూర్ టూమచ్ గా బికినీలు ధరించినా, మరీ ఇలా పేలికలాంటి దుస్తుల్లో కనిపించలేదు. బాలీవుడ్ లో చాలా మంది మెయిన్ స్ట్రీమ్ కథానాయికలు మరీ ఇంతగా చెలరేగిపోలేదు.
ప్రస్తుతం ఖుషీ ధరించిన స్పెషల్ బికినీ యూత్ లో హాట్ టాపిగ్గా మారింది. సింపుల్ గా బికినీలో జలకాలాటలకు సిద్ధమైన ఖుషీ తన స్నేహితుడు ఓర్రీతోను సెల్ఫీలు దిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. కొన్ని వరుస పరాజయాల తరవాత కెరీర్ ని రీవ్యాంప్ చేయడానికి ముందు, ఇలా బీచ్ విహార యాత్రలతో చిల్ అవ్వాలి. ప్రస్తుతం ఖుషీ చేస్తున్నది ఇదే. లవ్ యాపా, నాదానియాన్ లాంటి ఫ్లాపులతో పూర్తిగా నీరసించిపోయిన ఖుషీ కపూర్ ఇప్పుడు చల్లచల్లని కూల్ బీచ్ వాటర్స్ లో చిల్ అవుతోంది. డెబ్యూ ఫ్లాపైనా, మునుముందు తనను తాను రీషేప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ నటవారసురాలు.
