Begin typing your search above and press return to search.

నారీ పూజ‌లో ఖుష్బూ..ల‌క్కీ గాళ్!

వెట‌ర‌న్ న‌టి ఖుష్బూ పాలిటిక్స్..యాక్టింగ్ అంటూ రెండు ప‌వ‌డ‌ల ప్ర‌యాణం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Oct 2023 11:45 AM GMT
నారీ పూజ‌లో ఖుష్బూ..ల‌క్కీ గాళ్!
X

వెట‌ర‌న్ న‌టి ఖుష్బూ పాలిటిక్స్..యాక్టింగ్ అంటూ రెండు ప‌వ‌డ‌ల ప్ర‌యాణం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల‌కంటే సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ‌గా రాజ‌కీయాల‌పైనే మ‌న‌సు పెట్టి ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌లే జాతీయ మ‌హిళ క‌మీష‌న్ స‌భ్యురాలుగానూ ఎంపిక‌య్యారు. ఈనేప‌థ్యంలో తాజాగా ఖుష్బూ ఓప్ర‌ముఖ దేవాల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌లో పాల్గొన్నారు. ఏటా ఒక‌సారి మాత్ర‌మే నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మంలో ఆమె భాగం కావ‌డం విశేషం.

త్రిసూర్ లోని ప్రాచీన విష్ణుమాయ దేవాల‌యంలో ఏడాదికొసారి నారీ పూజ నిర్వ‌హిస్తుంటారు. దీనిలో పాల్గొనే ఆ మ‌హిళ‌ని భ‌గ‌వంతుడే ఎంపిక చేసుకుంటాడు అన్న‌ది అక్క‌డి వారి విశ్వాసం. ఆర‌కంగా ఈ ఏడాది పూజ‌లో ఖుష్బూ పాల్గొన‌డం విశేషం. ఆల‌యంలోని ఓపెద్ద కుర్చిలో ఖుష్బూ కుర్చున్నారు. కుర్చీ చుట్టూ భ‌క్తులు గుమిగూడారు. ఎదురుగా బ్రాహ్మాణ పండితులు వేద మంత్రాలు చ‌దువుతూ హార‌తి ఇస్తోన్న దృశ్యం చూడ‌వ‌చ్చు. ఆ స‌మయంలో ఖుష్బూ రెండు క‌ళ్లు మూసుకుని మ‌న‌సులో దేవుడ‌ని స్మ‌రించుకుని న‌మ‌స్కారం చేస్తున్నారు.

కుర్చికి అటు..ఇటు వైపుగా పులి బొమ్మ‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో ఆ కుర్చీ విశిష్ట‌త ఎంత గొప్ప‌దన్న‌ది తెలుస్తోంది. కేవ‌లం పూజ స‌మ‌యంలోనే దేవుడి ఎంపిక చేసిన మ‌హిళ‌ని పూజ సంద‌ర్భంగా ఆసీనులయ్యేలా పండితులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఖుష్బూ స్పందించారు. `ఆ భ‌గవంతుడి విశేష ఆశీస్సులు పొందాను. నారీ పూజ‌లో భాగం కావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను.

కేవ‌లం ప్ర‌త్యేక ఆహ్వానితుల‌కు మాత్ర‌మే ఇందులో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. పూజ‌లో పాల్గొనే వ్య‌క్తిని సాక్షాత్తు ఆ దేవుడే ఎంచుకుటారు అన్న‌ది అక్క‌డి వారి న‌మ్మ‌కం. మ‌నందర‌కీ ఆ భ‌గ‌వంతుడి ఆశిస్సులు ఉంటాయ‌ని న‌మ్ముతున్నాను. ప్ర‌పంచంలో ప్ర‌తీ ఒక్క‌రు సంతోషంతో...శాంతితో జీవించాల‌ని కోరుకున్నా` అని అన్నారు. ప్రస్తుతం ఆ పూజ‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.