Begin typing your search above and press return to search.

అమ్మ‌కు అచ్చు గుద్దిన అందం హీరోయిన్గా!

కోలీవుడ్ లో ఇప్ప‌టికే మామ్ క్రేజ్ తో కొంత మంది భామ‌లు హీరోయిన్ల‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 April 2025 1:38 PM IST
Khushbu Daughter Avantika Set for Kollywood Debut
X

కోలీవుడ్ లో ఇప్ప‌టికే మామ్ క్రేజ్ తో కొంత మంది భామ‌లు హీరోయిన్ల‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాధ కుమార్తెలిద్ద‌రు కార్తీక, తుల‌సి ఇద్ద‌రు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇండ‌స్ట్రీలో వాళ్లు స‌క్సెస్ కాలేదు. కొన్ని సినిమాలు చేసి వెనుదిరిగారు. అలాగే యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య కూడా లాంచ్ అయింది. కానీ ఆమె కూడా నిల‌దొక్కుకోలేక‌పోయింది. వివాహం చేసుకుని ఓఇంటిదైంది.


కార్తిక కూడా పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డింది. ఇలా కెలికితే కొంత మంది భామ‌ల పేర్లు తెర‌పైకి వ‌స్తాయి. అయితే ఇప్పుడా సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ ముంద‌కు సాగాల్సిన బాధ్య‌త ఈ న‌య వారసురాళ్ల‌పై ఉంది. సుంద‌ర్ .సి-ఖుష్బూల‌కు ఇద్ద‌రు అంద‌మైన కుమార్తెలు అవంతిక‌, ఆనందిత ఉన్నారు. అవంతిక అయితే అచ్చంగా అమ్మనే పోలి ఉంటుంది. ఖుష్పూ నోట్లో నుంచి ఊడిప‌డిన‌ట్లే ఉంటుంది.


ఇటీవ‌లే ఇద్ద‌రు చ‌దువులు కూడా పూర్తి చేసారు. ఈ నేప‌థ్యంలో అవంతిక మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతోంది. తాజాగా అమ్మ‌డు ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. బ్రౌన్ క‌ల‌ర్ బ్లౌజ్ పై ష‌ర్ట్ ధ‌రించి నేల‌పై కూర్చుని కెమారాకి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. క‌వ్వించే కిల్ల‌ర్ లుక్ లో క‌ట్టిప‌డేసింది. అమ్మ‌డి ఎద‌పై సొగ‌సైన టాటూ తో వావ్ అనిపించింది. రింగుల జుత్తు అంతే హైలైట్ అవుతుంది.


ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అవంతిక స్పీడ్ చూస్తుంటే? న‌టిగా తెరంగేట్రం చేయ‌డం కోస‌మే ఇలా సిగ్నెల్స్ పంపించింద‌ని తెలుస్తోంది. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు సినిమా రంగంలోనే కొన సాగుతున్నారు. డాడ్ డైరెక్ట‌ర్ గా..మామ్ న‌టిగా ప‌ని చేస్తూనే ఉన్నారు. కాబ‌ట్టి స‌రైన టైమ్ చూసి అవంతి క‌ను లాంచ్ చేయ‌డ‌మే ఆల‌స్యం.