ట్రెండింగ్ లోకి వచ్చిన ఖుష్బూ ఫ్యామిలీ పిక్.. విషయం తెలిస్తే షాక్ !
గత ఏడాది సెప్టెంబర్ లో తీసుకున్న ఫోటోని ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ షేర్ చేసిన ఫోటోను పక్కపక్కనే పెట్టి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
By: Madhu Reddy | 29 Aug 2025 9:00 PM ISTసామాన్య ప్రజలతో పోల్చుకుంటే సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా షేర్ చేసిన ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి రావడమే కాకుండా ఈ ఫోటో చూసిన అభిమానులు, నెటిజన్స్ ఆశ్చర్యపోతూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఖుష్బూ షేర్ చేసిన ఫ్యామిలీ పిక్ లో అంతగా ట్రెండింగ్ లోకి వచ్చేంత మేటర్ ఏముంది? అసలేం జరిగింది ? ఈమె ఫ్యామిలీ పిక్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ట్రెండింగ్ లో నిలిచిన ఖుష్బూ ఫ్యామిలీ పిక్..
తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ప్రముఖ నటి ఖుష్బూ డైరెక్టర్ సుందర్. సి ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వివాహం అనంతరం వీరికి ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పెళ్లీడుకు కూడా వచ్చారు. అంతా బాగానే ఉన్నా గతంలో ఖుష్బూ ఫ్యామిలీపై చాలామంది విమర్శలు గుప్పించారు. కారణం వారి అధిక బరువు. ముఖ్యంగా ఈ ఫ్యామిలీలో నలుగురు కూడా పోటీపడి మరీ బరువు పెరుగుతున్నారా? ఏంటి అంటూ చాలామంది వీరిపై ట్రోల్స్ చేశారు. ఇక ఈ ట్రోల్స్ పై స్పందించలేక ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఖుష్బూ ఫ్యామిలీ. ఏడాది తిరిగేలోపే కుటుంబంలోని అందరూ తమ లుక్ మార్చేశారు.
ఏడాదిలోనే ఫిట్నెస్ గోల్ రీచ్ అయిన ఖుష్బూ ఫ్యామిలీ..
గత ఏడాది సెప్టెంబర్ లో తీసుకున్న ఫోటోని ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ షేర్ చేసిన ఫోటోను పక్కపక్కనే పెట్టి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏడాదిలోనే ఇంత మార్పా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నలుగురు కూడా చాలా సన్నగా మారిపోయి మరింత అందంగా కనిపిస్తున్నారు. ఈ ఫ్యామిలీ పిక్ ని చూసి ఫిట్నెస్ గోల్ కానీ పెట్టుకున్నారా ఏంటి? అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా ఏడాదిలోనే నలుగురు కూడా ఒకేసారి బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు అని చెప్పవచ్చు. దీంతో ఖుష్బూ ఫ్యామిలీ ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న ఖుష్బూ కూతుళ్లు..
ఖుష్బూ విషయానికి వస్తే.. గత కొన్నాళ్లు నటనకు దూరమైన ఈమె.. ఒకవైపు రాజకీయాలలో ఉంటూనే.. మరొకవైపు జబర్దస్త్ కామెడీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈమె కూతుర్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇలా ఫిట్నెస్ పై దృష్టి పెట్టి సన్నబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సన్నబడడం అనేది.. కెరియర్ పై దృష్టి పెట్టడం అటు ఉంచితే.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
