ఇప్పటికీ ఇండస్ట్రీలో మేల్ డామినేషనే నడుస్తోంది!
ఖుష్బూ ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా ఎంతో యాక్టివ్ గా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.
By: Tupaki Desk | 14 March 2025 1:00 AM ISTఒకప్పుడు తన నటనతో ఎదురులేని హీరోయిన్ గా రాణించిన వారిలో ఖుష్బూ కూడా ఒకరు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆడియన్స్ ను అలరించిన ఖుష్బూ నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఖుష్బూ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు.
ఖుష్బూ ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా ఎంతో యాక్టివ్ గా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తెలుగుతో పాటూ తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. అక్కడి అభిమానులు ఖుష్బూకి గుడి కూడా కట్టారన్న విషయం తెలిసిందే. బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్న ఖుష్బూ సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు.
కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన ఖుష్బూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇండస్ట్రీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా రావాలని, అరణ్మనై4, మూకుతి అమ్మన్2 లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అప్పుడప్పుడే వస్తున్నాయని ఆమె తెలిపారు.
ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో హీరోల డామినేషనే ఎక్కువగా ఉందని, రజినీకాంత్, కమల్ హాసన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలే సినిమాల్లో ఎక్కువగా ఆధిపత్యం చలాయిస్తున్నారని ఖుష్బూ అన్నారు. డిజిటల్ యుగం వచ్చాక ఓటీటీల్లో మహిళలు టాలెంట్ చూపించడానికి ఎన్నో అవకాశాలొచ్చాయని, కానీ ఎవరూ దాన్ని సరిగా వాడుకోవడం లేదని ఖుష్బూ తెలిపారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
