Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ త‌ర్వాత ఖాన్ మ‌రో 3 భారీ సినిమాలు

ప్రస్తుతం ఖాన్ తన కుటుంబంతో కలిసి లండన్‌లో విహారయాత్రలో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 3:15 AM GMT
హ్యాట్రిక్ త‌ర్వాత ఖాన్ మ‌రో 3 భారీ సినిమాలు
X

2023లో హ్యాట్రిక్ కొట్టిన షారుఖ్ ఖాన్ త్వరలో 3 భారీ సినిమాల గురించి ప్రకటించనున్నారని తెలుస్తోంది. కింగ్ ఖాన్ గ‌త ఏడాది పఠాన్, జవాన్, డంకీ అనే మూడు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుత విజ‌యాల‌ను సాధించాడు. ఈ విజ‌యాలు అత‌డిని బాలీవుడ్‌లో తిరుగులేని రారాజుగా నిలబెట్టాయి. 2024లో కూడా ఇదే పరంపరను కొనసాగించాలని ఖాన్ ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అభిమానులు అత‌డి నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయో అంటూ ఆసక్తిగా వేచి చూస్తుండగా, కింగ్ ఖాన్ తన త‌దుప‌రి సినిమాలను ఈ నెలలోనే ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.

హిందుస్థాన్ టైమ్స్ క‌థ‌నం ప్రకారం... షారుఖ్ ఖాన్ అభిమానులు త‌న‌ తదుపరి చిత్రం ప్రకటనను త్వరలో ఆశించవచ్చు. ప్రస్తుతం ఖాన్ తన కుటుంబంతో కలిసి లండన్‌లో విహారయాత్రలో ఉన్నాడు. విరామం తర్వాత అతడు త‌న భారీ లైనప్‌ను ప్రకటిస్తాడని తెలిసింది. పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ అతడి తదుపరి చిత్రాల‌ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కంగారుగా ఏదో ఒక ప్రాజెక్ట్‌పై సంతకం చేయడానికి సిద్ధంగా లేడు.

త‌న‌ చేతిలో కొన్ని స్క్రిప్ట్‌లు ఉన్నాయి.. కానీ విరామం నుండి తిరిగి వచ్చిన తర్వాత వాటిని పరిశీలిస్తాడు. తాపీగా నెక్ట్స్ ఏం చేయాలనుకుంటున్నాడో విశ్లేషిస్తాడు. అయితే ఒక విషయంపై చాలా క్లారిటీ ఉంది. 2024 మొదటి నెలలోనే అతను మూడు చిత్రాలను ప్రకటించి, ఆపై వాటిపై పని ప్రారంభించాలని భావిస్తున్నట్టు టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అతడు తన ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటున్నందున ఇక‌పై విభిన్న‌మైన‌ జానర్ క‌థ‌లను ఎంపిక చేసుకుంటాడ‌ని కూడా ఊహిస్తున్నారు. ప్ర‌స్తుతానికి వీట‌న్నిటినీ ఖాన్ రహస్యంగా ఉంచాడు.

సూపర్ స్టార్ షారూఖ్ బాలీవుడ్ సినీచరిత్రలో మొదటిసారిగా ఒకే సంవత్సరంలో రెండు ఆల్-టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందించాడు. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా 1050.3 కోట్లు ఆర్జించగా, జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1148.32 కోట్లు వసూలు చేసింది. డిసెంబర్‌లో డంకీతో హ్యాట్రిక్ కొట్టాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ 410 కోట్లు వసూలు చేసింది. ఇటీవల కింగ్ ఖాన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. ఈ వేదిక‌పై తన జీవితంలోని హీన‌ దశ గురించి గుర్తు చేసుకున్నాడు. అతడి ప్రసంగం హృదయాలను గెలుచుకుంది.