Begin typing your search above and press return to search.

బ్యూటీ కిల్ల‌ర్ లుక్ తో ఖ‌ల్లాస్!

వెడెక్కించే ఫోటోషూట్ల‌తోనే ఇన్ స్టాలో ప‌న‌వుతంద‌ని భావించిన అమ్మ‌డు నాటి నుంచి కొత్త త‌ర‌హా ట్రీట్ తో ముందుకు సాగిపోతుంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:30 AM GMT
బ్యూటీ కిల్ల‌ర్ లుక్ తో ఖ‌ల్లాస్!
X

అందానికి అందం.. వేడెక్కించే హొయలు నిధి అగర్వాల్ సొంతం. ఆరంభంలో మ‌డిక‌ట్టినా! అటుపై అమ్మ‌డు చాలా మార్పులే చేసింది. గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో ఎలా ఫోక‌స్ అవ్వాలో! టెక్నిక్ ప‌ట్టుకుని ముందు కెళ్తుంది. చిట్టిపొట్టి దుస్తుల్లో...బికినీ అందాల్లో..స్కిన్ షోతో యువ‌త‌ని ఎలా ఆక‌ర్షిం చాలో! ప‌నిగట్టుకుని షో చేస్తుంది. వెడెక్కించే ఫోటోషూట్ల‌తోనే ఇన్ స్టాలో ప‌న‌వుతంద‌ని భావించిన అమ్మ‌డు నాటి నుంచి కొత్త త‌ర‌హా ట్రీట్ తో ముందుకు సాగిపోతుంది. తాజాగా బ్యూటీ కిల్ల‌ర్ లుక్ కి ఫిదా అవ్వాల్సిందే.


ఇదిగో ఇక్క‌డిలా గిరిజ‌న బ్యూటీలా ముస్తాబైన అమ్మ‌డు అందానికి మంత్ర ముగ్దులు అవ్వాల్సిందే. ర‌విక‌లేని చీరందంలో అమ్మ‌డు అచ్చంగా గిరిజ‌న యువ‌తిని త‌ల‌పిస్తుంది. ముక్కుకి పుడ‌క‌..చెవుల‌కు బుట్ట‌లు.. చేతి క‌డియాలు..నెక్ పై డిజైన‌ర్ చైన్ అన్ని నిధిని కొత్త‌గా ఆవిష్క‌రించాయి. నుదిటిన న‌ల్ల‌టి బొట్టు..క‌ళ్ల‌కు కాటుక‌..పెదాల‌కు పూసిన ఎరుపు రంగు లిప్ స్టిక్ అన్నీ నిధి మ‌త్తులో దించేయ‌డం ఖాయం.


బ్యాక్ గ్రౌండ్ లో డ్రెస్ డిజైన్ రంగుతో న్యూ ఫీల్ ని తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. నిధి అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. మెస్మ‌రైజింగ్ బ్యూటీ.. లుక్స్ గార్జియ‌స్..మై బ్యూటీ అంటూ నిధి అందాన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రెగ్యుల‌ర్ ఫోటో షూట్ల‌కు భిన్న‌మైన సెష‌న్ ఇది. రొటీన్ కి భిన్నంగా కొత్త ఫోటో సెష‌న్ ట్రై చేసి ఇన్ స్టాలో మ‌రింత పాపుల‌ర్ అవుతుంది.

ఇక నిధి అగ‌ర్వాల్ చూస్తే చేతిలో `హరి హర వీరమల్లు` ఉంది. కానీ అది ఎప్పుడు పూర్తై..ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. దీంతో నిధి కూడా ఈ సినిమాపై ఆశ‌లు చంపుకున్న‌ట్లే క‌నిపిస్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న `రాజాసాబ్` లో ఛాన్స్ అందుకుంది. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమా కూడా 2025 లోనే రిలీజ్ అంటున్నారు.