Begin typing your search above and press return to search.

ఖలేజా రీ రిలీజ్.. వరల్డ్ వైడ్ గా సంచలనమే!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో ఖలేజా సినిమా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   31 May 2025 12:30 PM IST
ఖలేజా రీ రిలీజ్.. వరల్డ్ వైడ్ గా సంచలనమే!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో ఖలేజా సినిమా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు రాగా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా డిజాస్టర్ గా మారింది. మేకర్స్ కు అప్పట్లో నష్టాలు వచ్చాయని టాక్ వచ్చింది.

కానీ ఆ తర్వాత ఆడియన్స్ కు మూవీ బాగా నచ్చేసింది. కల్ట్ క్లాసిక్ స్టేటస్ ఇచ్చేశారు. దీంతో మూవీని రీ రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో ఆడియన్స్, ఫ్యాన్స్ మేకర్స్ ను కోరుతున్నారు. అందుకే నిన్న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా.. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. దీంతో రెస్పాన్స్ ఊహించిన రీతిలో ఉందనే చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్నీ సెంటర్స్ లో ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. థియేటర్స్ లో పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోస్.. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.

ఇప్పుడు సినిమా వసూళ్లు పరంగా చూస్తే.. పెద్ద సంచలనం సృష్టించేలా ఉంది. భారీ వసూళ్లను రాబడుతోంది. కచ్చితంగా రూ.10 కోట్లను రాబడుతుందని వేసిన ట్రేడ్ పండితుల అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇండియా మొత్తంలో 1531 షోలు (గురువారం రాత్రి+ శుక్రవారం) పడగా.. రూ.4.22 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది.

అయితే గత ఏడాది సెప్టెంబర్ 2న (మండే+ సన్ డే నైట్ షో) రిలీజ్ అయిన గబ్బర్ సింగ్.. రూ.6.04 కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ టాప్ రికార్డు ఇప్పటికే క్రియేట్ చేసింది. అదే సమయంలో నార్త్ అమెరికాలో 72 వేల డాలర్లు ఖలేజా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు $100K మార్క్ వైపు దూసుకుపోతుంది.

అక్కడ గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది ఖలేజా. అప్పుడు గబ్బర్ సింగ్ $66,000 వసూలు చేయగా.. ఇప్పుడు ఖలేజా వాటికి మించి రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గబ్బర్ సింగ్ కు చేరువలోకి వచ్చింది. అలా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఖలేజా రీ రిలీజ్ లో ఫస్ట్ డే.. రూ.5 కోట్లకు పైగా సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

అయితే రీ రిలీజ్ ట్రెండ్ లో బిజినెస్ మ్యాన్, మురారి, గబ్బర్ సింగ్ తర్వాత రూ.5 కోట్లకుపైగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఖలేజా నిలిచింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ దే ఓపెనింగ్ రికార్డు ఉన్నప్పటికీ.. మూడు (సినిమాలు) రూ.5 కోట్ల డే 1 వసూళ్లతో మిగతా హీరోల కంటే మహేష్ ముందున్నారని చెప్పాలి.