Begin typing your search above and press return to search.

ఖలేజా రీ రిలీజ్ రికార్డుల వేట.. టాప్ 5లో నెంబర్ వన్!

ఈ నేపథ్యంలో ఖలేజా 4K రీ రిలీజ్ మే 30న గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి.

By:  Tupaki Desk   |   24 May 2025 2:21 PM IST
ఖలేజా రీ రిలీజ్ రికార్డుల వేట.. టాప్ 5లో నెంబర్ వన్!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా సినిమాకు ఏ స్థాయిలో కల్ట్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2010లో విడుదలై అప్పట్లో కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, కాలక్రమంలో ఖలేజా ఒక కల్ట్ క్లాసిక్ గా మారింది. సోషల్ మీడియా, టీవీ టెలికాస్ట్‌లలో వచ్చిన ఆదరణతో ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లో మళ్లీ చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉప్పొంగిపోతోంది.

ఈ నేపథ్యంలో ఖలేజా 4K రీ రిలీజ్ మే 30న గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఈ రీ రిలీజ్‌కి సంబంధించిన క్రేజ్ ఆశించిన దానికంటే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని గంటల కిందటే బుకింగ్స్ ఓపెన్ చేసినా, ఇప్పటివరకు వచ్చిన సంఖ్య తెలుగు రీ రిలీజ్ సినిమాల హిస్టరీలోనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లైంది.

అందుకు కారణం – హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని రీ రిలీజ్ సినిమాల్లో ఖలేజా 4K అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలకు ఇంకా మూడు రోజులు ఉండగానే ఈ సినిమా సిటీలో రూ.1 కోటి గ్రాస్‌ను దాటి పోయింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ కలెక్షన్స్ రిలీజ్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది రీ రిలీజ్ సినిమాలకు హై స్టాండర్డ్‌ను సెట్ చేసినట్లే.

ఇప్పటివరకు హైదరాబాద్‌లో 2025లో రీ రిలీజ్ అయిన సినిమాల్లో టాప్-5 అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లిస్ట్ ఇలా ఉంది:

1. ఖలేజా - రూ.1 కోటి

2. ఆర్య 2 - రూ.88 లక్షలు

3. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) 4K - రూ.70 లక్షలు

4. సలార్ - రూ.65 లక్షలు

5. వర్షం 4K - రూ.47 లక్షలు

ఈ లిస్టులో ఖలేజా క్లీన్‌గా టాప్‌లో నిలవడమే కాకుండా, రీ రిలీజ్ సినిమాల స్థాయిని ఏ రేంజ్‌కు తీసుకెళ్లచ్చో చూపించింది. ఈ సినిమా విడుదల రోజున ఒకవేళ రైట్ థియేటర్ కౌంట్ దొరికితే, కొన్ని ఫుల్‌రన్ రికార్డులు కూడా బ్రేక్ చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఖలేజా సక్సెస్‌తో రీ రిలీజ్ సినిమాలకు బోనస్ పీరియడ్ మొదలైనట్లే. అభిమానుల్లో ఉత్సాహం పెరగడం, సెకండ్ హ్యాండ్ జనరేషన్ ఖలేజాను థియేటర్లో చూడాలనుకోవడం వంటి అంశాలే ఈ క్రేజ్‌కు కారణాలు. మరి మే 30న థియేటర్లలో ఖలేజా కలెక్షన్ల తుఫాను ఎలా ఉండబోతుందో చూడాలి.