Begin typing your search above and press return to search.

ఖైదీ, KGF, విక్రమ్, వాల్తేరు వీరయ్య.. ఇప్పుడు యానిమాల్

స్టార్ హీరోల యాక్షన్ సినిమాలలో గన్నలు కత్తులు విభిన్నమైన తరహాలో ఉండడం ఎప్పటినుంచో కామన్ గా వస్తూ ఉన్నదే.

By:  Tupaki Desk   |   24 Nov 2023 7:53 AM GMT
ఖైదీ, KGF, విక్రమ్, వాల్తేరు వీరయ్య.. ఇప్పుడు యానిమాల్
X

ఇటీవల కాలంలో యాక్షన్ సినిమాలు చాలా విభిన్నమైన తరహాలో వస్తున్నప్పటికీ ఏదో ఒక విషయంలో మాత్రం ఒకదానికి మరొకటి లింక్ అవుతూ వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా లేదంటే దర్శకులు ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో అవుతున్నారా సందేహాలు గట్టిగానే కొట్టుకొస్తున్నాయి. స్టార్ హీరోల యాక్షన్ సినిమాలలో గన్నలు కత్తులు విభిన్నమైన తరహాలో ఉండడం ఎప్పటినుంచో కామన్ గా వస్తూ ఉన్నదే.

ఈ స్టైల్ లో ఎవరు ఎంత కొత్తగా ఆయుధాలను చూపించబోతున్నారు అని విషయంలోనే అసలు ఫలితం ఆధారపడి ఉంటుంది. రీసెంట్ గా ఒక ఆయుధాన్ని మాత్రం దాదాపు అన్ని ఇండస్ట్రీల వాళ్ళు ప్రధానంగా చూపిస్తూ ఉండడం హైలెట్ అవుతూ వస్తోంది. ఖైదీ సినిమా నుంచి ఆ పవర్ ఫుల్ వెపన్ కొనసాగుతూ వస్తుంది.

ఆ తర్వాత కేజిఎఫ్ సినిమాలో విక్రమ్ సినిమాలో కూడా అది బాగా హైలైట్ అయింది. ఇక ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య లో కూడా అది కనిపించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి రాబోతున్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలో కూడా హైలెట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఆయుధం అదేదో కాదు. పవర్ఫుల్ మిషన్ గన్.

ఖైదీ సినిమాలో దర్శకుడు లోకేష్ కనగరాజు ఆ మిషన్ గన్ ను ఏ రేంజ్ లో చూపించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అది కాస్త ప్రతి సినిమాకు అప్డేట్ అవుతూ వస్తున్నట్లుగా సైజు మాత్రం పెరుగుతూ ఉంది. కేజిఎఫ్ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టాండ్ తో కూడిన మెషిన్ గన్ తో బాక్సాఫీస్ బ్లాస్ట్ చేశాడు. అనంతరం విక్రమ్ సినిమాలో మరోసారి లోకేష్ ఏకంగా మెషిన్ గన్ ను కమల్ హాసన్ చేత లాక్కొచ్చి మరో లెవెల్ కు తీసుకు వెళ్ళాడు.

ఇక వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ మిషిన్ గన్ ను చేతిలో పట్టుకుని ట్రెండును రెగ్యులర్ గా ఫాలో అయ్యారు. ఇక ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ గా సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా యానిమాల్ సినిమాలో అంతకుమించి అనేలా.. ఇంతకుముందు ఎవరు చూపించని భారీ మిషిన్ గన్ ను హైలెట్ చేస్తున్నాడు. ట్రైలర్ లో ఇది బాగా హైలెట్ అయ్యింది. ఆ సీన్ సినిమాకు మంచి వైబ్ క్రియేట్ చేస్తోంది. ఏదేమైనప్పటికి మిషిన్ గన్ ట్రెండు సినిమా సినిమాకు మరింత అప్డేట్ అవుతూ వస్తోంది. ఇక మెషిన్ గన్ ట్రెండులో యానిమాల్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.