'ఖైదీ -2' లో టాలీవుడ్ స్టార్!
అది నెగిటివ్ రోల్ అని సమాచారం. 'ప్రస్థానం'...'సత్య 2' లాంటి చిత్రాల్లో శర్వానంద్ పెర్పార్మెన్స్ నచ్చి ఈ అవకాశం కల్పిస్తున్నాడుట.
By: Tupaki Desk | 8 May 2025 4:30 PMకోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ 'ఖైదీ 2' పట్టాలెక్కించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి 'ఖైదీ 2' మొదలవుతుంది. ఇందులో కార్తీ మెయిన్ లీడ్ పోషిస్తున్నాడు. ఇంకా చాలా పాత్రలు ప్రధానంగా హైలైట్ అవుతన్నాయి. ' ఖైదీ' లో ఉన్న పాత్రలతో పాటు రెండవ భాగంలో చాలా కొత్త పాత్రలు యాడ్ అవుతాయి. రెండవ భాగాన్ని మరింత స్పాన్ ఉన్న చిత్రంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఖైదీ'కు పాన్ ఇండియాలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆ కారణంగా లోకేష్ కనగరాజ్ ఓ యూనివర్శ్ క్రియేట్ చేయగలిగాడు. 'లియో' చిత్రాన్ని తెరకెక్కించాడు.'ఈ నేపథ్యంలో 'ఖైదీ 2'లో చాలా కొత్త పాత్రలు కనిపించడం పక్కా. అయితే ఈసారి టాలీవుడ్ నటులకు లోకేష్ అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడుట.
అది నెగిటివ్ రోల్ అని సమాచారం. 'ప్రస్థానం'...'సత్య 2' లాంటి చిత్రాల్లో శర్వానంద్ పెర్పార్మెన్స్ నచ్చి ఈ అవకాశం కల్పిస్తున్నాడుట. ఆ రకంగా చూస్తే శర్వానంద్ కిది మంచి అవకాశం. సీరియస్ యాక్షన్ రోల్స్ చేయడంలో శర్వా స్పెషలిస్ట్. విలక్షణమైన నటనతో ఆకట్టుకోవడం శర్వా ప్రత్యేకత. సరైన స్టోరీలు పడక శర్వా వెనుకబడ్డాడు కానీ లేకపోతే శర్వానంద్ ట్యాలెంట్ కి నటుడిగా తర్వాత స్థానంలో ఉండాల్సిన నటుడు.
లోకేష్ రూపంలో గొప్ప అవకాశం కళ్ల ముందుంది. సద్వినియోగం చేసుకోవడం శర్వా చేతుల్లో ఉంది. శర్వా ఎంట్రీతో టాలీవుడ్ మార్కెట్ పరంగానూ సినిమాకు కలిసొస్తుంది. మరి శర్వా ఎంట్రీ విషయంలో నిజమెం తో మేకర్స్ ధృవీకరిస్తే గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా కొన్ని సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.