ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ పిడుగుద్దులు!
ఇంకా 'ఖైదీ '2 లో మరిన్ని కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. చియాన్ విక్రమ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తు న్నారు.
By: Tupaki Desk | 13 Jun 2025 12:30 AMఎ ల్ సీ యూ నుంచి 'ఖైదీ 2' కి సర్వం సిద్దమవుతోంది. ఎల్ సీయూలోనే ఓ వండర్ గా చిత్రాన్ని లోకేష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ పాత్రలు ఎలా ఉంటాయి? అన్న దానిపై అప్పుడే క్యూరియాసిటీ మొదలైంది. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని కూకట వేళ్లతో పెకిలించిన కారకుడిపై రోలెక్స్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. కారకుడిని తెచ్చిన వాడికి లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ ఆఫర్ ఇచ్చాడు.
రోలెక్స్ అండ్ టీమ్ ఢిల్లీ కోసం ఎలాంటి అన్వేషణ్ మొదలు పెట్టంటలి? ఢిల్లీ- కర్నన్ మధ్య సంబంధం ఏంటి? అనే దానిపై కూపీ మొదలవుతుంది. రోలెక్స్ ప్రతిదాడి ఎలా ఉంటుంది? ఢీల్లీ -కర్నన్ సంయుక్త ద్వయం రోలెక్స్ ని ఎలా ఎదుర్కొన బోతున్నారు? అన్నది ఖైదీ- 2 లో పీక్స్ లో ఉండబోతుంది. కెప్టెన్ లోకేష్ తనదైన ట్రీట్ మెంట్ తో ఎల్ సీయూ కొనసాగింపు ఎలా ఉంటుంది? అన్నది మరింత ఇంట్రెస్టింగ్.
ఇంకా 'ఖైదీ '2 లో మరిన్ని కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. చియాన్ విక్రమ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తు న్నారు. డ్రగ్స్ సామ్రాజ్యంలోకి చియాన్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? కొత్త పాత్రలు ఇంకెంత గ్రిప్పింగ్ గా ఉంటాయి? అన్న దానిపై సస్పెన్స్ మొదలైంది. అలాగే సినిమాలో అనుష్క శెట్టి కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఖైదీ టీమ్ ఖండించింది. అనుష్కను ఎలాంటి పాత్ర కోసం అప్రోచ్ అయినట్లు వెల్లడించలేదు.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ 'కూలీ' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 14న చిత్రం రిలీజ్ అవుతుంది. అటుపై లోకేష్ 'ఖైదీ 2' పనుల్లో పూర్తి స్థాయిలో బిజీ అవుతాడు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి లోకేష్ టీమ్ సీరియస్ గా పనిచేస్తోంది. రతన్ కుమార్-ధీరజ్ వైదే లోకేష్ రైటింగ్ టీమ్ లో కీలక సభ్యులు. రైటింగ్ కి సంబంధించిన లోకేష్ కొలబ్రిషన్ అంతా వీళ్లతోనే.