Begin typing your search above and press return to search.

టైటిల్ కి ముందే KH పోస్ట‌ర్ దుమారం!

పోస్ట‌ర్ తో నే ద్వ‌యం యూనిక్ కంటెట్ తో రాబోతున్న‌ట్లు రివీల్ చేసారు. పోస్ట‌ర్ ఆద్యంతం అస‌క్తిని పెంచేస్తుంది. క‌మ‌ల్ లుక్...పోస్ట‌ర్ డిజైన్ లో మ‌ణిర‌త్నం మార్క్ ని మించి హైలైట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:18 AM GMT
టైటిల్ కి ముందే KH పోస్ట‌ర్ దుమారం!
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్-మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ లో మ‌రో సినిమాకి రంగం సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత ఈ కాంబో చేతులు క‌ల‌ప‌డంతో అంచ‌నాలు ఆకాశ‌న్నం టుతున్నాయి. హిట్ క‌ల‌యిక ఎలాంటి కంటెంట్ తో రాబోతుంది? ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయ‌బోతున్నారు? అన్న ఉత్కంఠ‌.. ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజుకి ఒక్క రోజు ముందుగానే అవే అంచ‌నాలు సంచ‌ల‌నాలు అయ్యేలా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో ముందుకొచ్చేసారు.


పోస్ట‌ర్ తో నే ద్వ‌యం యూనిక్ కంటెట్ తో రాబోతున్న‌ట్లు రివీల్ చేసారు. పోస్ట‌ర్ ఆద్యంతం అస‌క్తిని పెంచేస్తుంది. క‌మ‌ల్ లుక్...పోస్ట‌ర్ డిజైన్ లో మ‌ణిర‌త్నం మార్క్ ని మించి హైలైట్ అవుతుంది. ఇంత వ‌ర‌కూ మ‌ణిర‌త్నం ట‌చ్ చేయ‌ని స‌రికొత్త క‌థాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు? అన‌డానికి పోస్ట‌ర్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఓ సారి పోస్ట‌ర్ లోకి వెళ్తే..క‌మ్ముకున్న కారు మేఘాల్లో క‌మ‌ల్ రూపాన్ని అద్భుతంగా డిజైన్ చేసారు.

ముఖానికి గోను సంచెలు బిగించి కేవ‌లం క‌ళ్లు మాత్ర‌మే క‌నిపించేలా పోస్ట‌ర్ వ‌దిలారు. క‌మ‌ల్ వెనుక మ‌రో నులుగురు బృందం అదే లుక్ లో క‌నిపిస్తున్నారు. పోస్ట‌ర్ పై త‌మిళ్ లెట‌ర్స్ లో క‌ని కనిపించేలా కొన్ని అక్ష‌రాలున్నాయి. అలాగే టైటిల్ అనౌన్స్ మెంట్ చేస్తూ ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ఓ వీడియో కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

క‌మ‌ల్ లుక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. పోస్ట‌ర్ తో క‌థాంశంపై మ‌రింత ఆస‌క్తి సంత‌రించుకుంటుంది. ఇక ఈ చిత్రానికి సంగీత దిగ్గ‌జం ఏ.ఆర్ .రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI)- మద్రాస్ టాకీస్- రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్‌లో ఈ సినిమా ని భారీ బ‌డ్జెట్ నిర్మిస్తున్నారు.