Begin typing your search above and press return to search.

బర్త్ డే రోజున కేజీఎఫ్ యశ్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ఫ్యాన్స్!

ఆ సంగతి అలా ఉంటే... యశ్ బర్త్ డే వేళ ఆయనకు పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ కట్టే సయమంలో ప్రమాదం జరిగింది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 10:55 AM GMT
బర్త్  డే రోజున కేజీఎఫ్  యశ్  కు బ్యాడ్  న్యూస్  చెప్పిన ఫ్యాన్స్!
X

కేజీఎఫ్ సినిమాతో కేవలం కన్నడనాటే కాకుండా చాలా రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నారు కన్నడ స్టార్ హీరో యశ్! ఆయన ఫ్యాన్ బెల్ట్ కర్ణాటలో ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ అని అంటుంటారు. దీంతో... నేడు ఈ స్టార్ హీరో పుట్టిన రోజు కావడంతో అన్ని చోట్లా అభిమానులు పోటాపోటీగా సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం యశ్ ఫ్యాన్స్ బర్త్ డే పార్టీ మూడ్ లో ఉన్నారు!

వాస్తవానికి నిన్నమొన్నటివరకూ కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాలు చేసిన యశ్... కేజీఎఫ్ సృష్టించిన ప్రళయం అనంతరం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా కన్నడ ఇండస్ట్రీలోనే వసూళ్ల స్థాయిని ఒక్కసారిగా పెంచేసిందని చెబుతారు. దీంతో ఆయన స్టార్ హీరోగా మారిపోయారు.

ఆ సంగతి అలా ఉంటే... యశ్ బర్త్ డే వేళ ఆయనకు పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ కట్టే సయమంలో ప్రమాదం జరిగింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా బర్త్ డే బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు మరణించారు. దీంతో బర్త్ డే సంబరాల వేళ తీవ్ర విషాదం నెలకొంది.

అవును... కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లా, లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో యశ్ బర్త్ డే బ్యానర్‌ ను ఏర్పాటు చేస్తుండగా ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో వారంతా అక్కడికక్కడే మరణించారు. మరణించినవారిని హనమంత హరిజన్ (21), మురళీ నాద వినమణి (20), నవీన్ గాజి (19) గా చెబుతున్నారు.

ఆ సమయంలో వీరితోపాటు వీరితో పాటు ఉన్న మంజునాథ్ హరిజన్, ప్రకాష్ మాగేరి, దీపక హరిజన్‌ లకు తీవ్ర గాయాలవ్వగా... వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో... ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న తమ స్నేహితుల కుటుంబాలను యశ్ ఓదార్చాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే చంద్రు లమాని ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులతో పరామర్శించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు పరామర్శించి ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా... యశ్ ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే.