Begin typing your search above and press return to search.

రాఖీభాయ్​కు​ తల్లిగా.. ఒప్పుకోకపోతే ఏం చేశారంటే!

కానీ ఇప్పుడు కేజీయఫ్​ సాధించిన విజయం, అందులో నా పాత్రకు దక్కిన ఆదరణ ఎంతో ఆనందంగా ఉంది" అని అర్చన చెప్పింది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:08 AM GMT
రాఖీభాయ్​కు​ తల్లిగా.. ఒప్పుకోకపోతే ఏం చేశారంటే!
X

ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి రికార్డులు సృష్టించిన‌ సినిమా కేజీఎఫ్​. మదర్ సెంటిమెంట్​తో వచ్చిన ఈ సిరీస్..​ పాన్ ఇండియా సినీ ప్రియులను కట్టిపడేసింది. సినిమాలోని ప్రతి పాత్ర అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే అన్నీ పాత్రల్లలో కల్లా.. రాఖీభాయ్​తో పాటు అమ్మ పాత్ర విమర్శకుల ప్రశంసలను ఎక్కువగా అందుకుంది. ఆ అమ్మ పాత్ర చేసిన నటి అర్చ‌న జైస్. అయితే ఈ పాత్ర కోసం తనన బలవంతం చేసి ఎలా ఒప్పించారో మరోసారి చెప్పిదామె.

"నాకు 20, 21 ఏళ్లు ఉంటాయి. టీమ్ కాల్​ చేసి ఛాన్స్ ఉందని చెబితే షాక్​ అయ్యాను. నా వయసు తెలుసా? అమ్మా క్యారెక్టరా? అని అన్నాను. నిజానికి అప్పుడు కథ కూడా వినడానికి సిద్ధంగా లేను. చాలా ఒప్పించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ తర్వాత ఓ కామన్​ ఫ్రెండ్​.. కనీసం స్క్రిప్ట్ అయినా విను, పెద్ద ప్రొడక్షన్ హౌస్​ నుంచి వచ్చినా ఆఫర్​ కదా అని చెబితే కథ విన్నాను. కథ విన్నాక కూడా అంత ఎగ్జైట్ అనిపించలేదు. అయినా ఇక ఆ తర్వాత చేసేశాను. నేను ఒక క్లాసికల్ డ్యాన్సర్​. కానీ ఇప్పుడు కేజీయఫ్​ సాధించిన విజయం, అందులో నా పాత్రకు దక్కిన ఆదరణ ఎంతో ఆనందంగా ఉంది" అని అర్చన చెప్పింది.

ఇకపోతే కేజీయఫ్​ తర్వాత తన లైఫ్​ ఎలా మారిందో కూడా వివరించింది అర్చన. "నాకు యశ్​తో ఎటువంటి సన్నీవేశాలు లేవు. రెండో భాగంలో ఒకటే ఉంటుంది. కాబట్టి ఆయనతో చేసిన సీన్​ కోసం ఏమీ ప్రాక్టీస్​ చేయలేదు. కేజీయఫ్​ తర్వాత పర్సనల్​ లైఫ్ అలానే ఉంది. ప్రొఫెషనల్​ లైప్ మాత్రం చాలా మారింది. పాపులారిటీ ఫేమ్ దొరికింది. సినిమా అవకాశాల విషయానికొస్తే అలాంటి అమ్మ పాత్రలే వస్తున్నాయి. కానీ మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను." అని అర్చన పేర్కొంది.

ఇకపోతే గతంలో.. మహాదేవీ సీరియల్‌ను చూసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌లో ఛాన్స్ ఇచ్చారని అర్చన పేర్కొంది. ఈమెకు డ్యాన్స్​ అంటే చాలా ఇష్టం. నాట్యం కోసం చదువుని పక్కన పెట్టి మరీ అందులో శిక్షణ తీసుకుంది. అనంతరం నటనలో అవకాశం రావడంతో మహాదేవీ సీరయల్​లో నటించింది.