Begin typing your search above and press return to search.

కేజీఎఫ్-3పై ఇలా ట్విస్ట్ ఇచ్చారెంటీ

బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ మూవీ ఎన్ని రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. కన్నడ హీరో యశ్ లీడ్ రోల్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:04 AM GMT
కేజీఎఫ్-3పై ఇలా ట్విస్ట్ ఇచ్చారెంటీ
X

బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ మూవీ ఎన్ని రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. కన్నడ హీరో యశ్ లీడ్ రోల్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రంతో అటు యశ్.. ఇటు నీల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే కేజీఎఫ్ తర్వాత రెండో పార్ట్ తో మరోసారి దుమ్ముదులిపారు నీల్. పోస్ట్-పాండమిక్ ప్రపంచంలో తన సినిమాతో కొత్త రికార్డులను సృష్టించారు.

అయితే కేజీఎఫ్ రెండు పార్ట్ ల తర్వాత కేజీఎఫ్ 3 కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ తో కేజీఎఫ్ 3 లింక్ ఉంటుందని అంతా అనుకున్నారు. తాజాగా ఈ రూమర్స్ పై నీల్ క్లారిటీ ఇచ్చారు. అలాగే కేజీఎఫ్-3, జూనియర్ ఎన్టీఆర్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

"కేజీఎప్-3 కచ్చితంగా ఉంటుంది. కానీ నేను దర్శకుడో కాదో నాకు తెలియదు. యశ్ మాత్రం నటిస్తారు. అందుకే మేం ఇంకా కేజీఎఫ్-3ని ప్రకటించలేదు. స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉంది. అధికారికంగా ప్రకటించడానికి ముందు స్క్రిప్ట్ పై ఓ నిర్ణయానికి వచ్చాం" అంటూ చెప్పుకొచ్చారు.

మరోవైపు సలార్ తర్వాత హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా స్టోరీపై ప్రశాంత్ కూడా స్పందించారు. ఇది చాలా కొత్త స్టోరీ అని తెలిపారు. "భిన్నమైన ఎమోషన్లతో సాగే ఓ భిన్నమైన సినిమా ఇది. జానర్ గురించి నేనేమీ చెప్పను. కానీ ఇదొక యాక్షన్ సినిమా అని అభిమానులు అనుకుంటారు. నాకు మాత్రం నేను ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కొత్త స్టోరీ ఇది. దానికి తగిన ఎమోషన్ ఇందులో ఉంది" అని ప్రశాంత్ నీల్ తెలిపారు.

అయితే వచ్చే ఏడాది జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభం కానుంది. 2025లో సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే యశ్ తో నీల్ కేజీఎఫ్ 3 తీసే అవకాశం ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తవగానే ఎన్టీఆర్ 31 ప్రారంభమవుతుంది.