Begin typing your search above and press return to search.

'స‌లార్ 2' కంటే ముందే 'KGF 3' ప‌ని మొద‌లు

స‌లార్ 2 షూటింగ్ ప్రారంభించే ముందు దీనిని పూర్తి చేస్తాడు. కేజీఎఫ్ 3 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ‌తారు'' అని తెలిసింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 3:04 PM GMT
స‌లార్ 2 కంటే ముందే KGF 3 ప‌ని మొద‌లు
X

KGF చాప్టర్ 1 - KGF 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ల వెనుక ఉన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార‌త‌దేశంలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌డితో ప‌ని చేసేందుకు చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్- ఎన్టీఆర్- మ‌హేష్ స‌హా ప‌లువురు ద‌క్షిణాది అగ్ర హీరోలు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయితే ప్ర‌భాస్ తో 'స‌లార్ 1' తెర‌కెక్కిస్తున్న ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్ 2'ని కూడా పూర్తి చేశాకే ఇత‌ర హీరోల‌తో సినిమాలు చేస్తాడ‌ని ప్ర‌చార‌మైంది. స‌లార్ పార్ట్ 1 యాక్ష‌న్ ప్యాక్డ్ టీజ‌ర్ ని వీక్షించాక ఈ సినిమాపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. మోస్ట్ అవైటెడ్ మూవీ విడుద‌ల కోసం అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.

అయితే ఇంత‌లోనే KGF చాప్టర్ 3 ఎప్పుడు? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కెజిఎఫ్ 2 మొదటి వార్షికోత్సవం సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ అధినేత‌ల‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్ట‌ర్ 3 ని ఎప్పుడు ప్రారంభించబోతున్నాడో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది.

ఇంత‌లోనే తాజా అప్ డేట్ అందింది. సాలార్ 2 షూటింగ్‌కి ముందే ప్రశాంత్ నీల్ KGF చాప్టర్ 3 పనిని ప్రారంభిస్తాడని, త్వ‌ర‌లో స్క్రిప్టు ప‌నుల్లో త‌ల‌మున‌క‌లు అవుతార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

స‌లార్: పార్ట్ 1 చిత్రీక‌ర‌ణ‌ను ముగించి త‌దుప‌రి కేజీఎఫ్ 3పై దృష్టి సారించాల‌నేది ప్ర‌శాంత్ నీల్ ఆలోచ‌న‌. నిజానికి ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్రపంచం ఎంత పెద్దదో అందరికీ తెలుసు. అత‌డు సరికొత్త KGF విశ్వాన్ని అభివృద్ధి చేసాడు. ఇది ఒరిజిన‌ల్ స్టోరీతో మొద‌లైన‌ ఫ్రాంఛైజీ. భార‌తీయ సినీ ప్రపంచంలో అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటిగా కేజీఎఫ్‌ అభివృద్ధి చెందుతోంది. ఇంత‌లోనే ప్ర‌భాస్ తో స‌లార్ ఫ్రాంఛైజీ అంతే వేడి పెంచుతోంది. కేజీఎఫ్ - స‌లార్ క్రాస్ ఓవ‌ర్ కంటెంట్ తో అతిపెద్ద యూనివ‌ర్శ్ ని ప్ర‌శాంత్ నీల్ క్రియేట్ చేయ‌బోతున్నాడ‌న్న‌ది కూడా ఇటీవ‌ల ఉత్కంఠ‌ను మ‌రింత పెంచుతోంది.

ప్ర‌శాంత్ నీల్ స‌న్నిహిత‌ సోర్స్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం....''ప్రశాంత్ నీల్ త్వరలో KGF చాప్టర్ 3 పనిని ప్రారంభిస్తాడు. స‌లార్ 2 షూటింగ్ ప్రారంభించే ముందు దీనిని పూర్తి చేస్తాడు. కేజీఎఫ్ 3 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ‌తారు'' అని తెలిసింది.

కేజీఎఫ్ ప్ర‌పంచం త‌ర్వాత స‌లార్ ప్ర‌పంచం ఎలా ఉండ‌బోతోందో చూడాల‌న్న ఉత్కంఠ‌ ప్రేక్ష‌కుల్లో ఉంది. ఒకదాని తర్వాత ఒకటి యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌లను ప్ర‌శాంత్ నీల్ ప్రేక్షకులకు అందిస్తుండ‌డంతో క్యూరియాసిటీ అంత‌కంత‌కు పెరుగుతోంది. కేజీఎఫ్ 1- కేజీఎఫ్ 2 చిత్రాల్లో న‌టించిన రాకింగ్ స్టార్ య‌ష్ కేజీఎఫ్ చాప్ట‌ర్ 3లోను న‌టించ‌నున్నారు.