`కేజీఎఫ్ చాప్టర్ 3`కి ఇంకా టైమ్ కావాలా?
`పుష్ఫ 3` తరువాత ఇండియా వైడ్‌గా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ `కేజీఎఫ్ చాప్టర్ 3`. `కేజీఎఫ్` సిరీస్‌లో భాగంగా రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 21 April 2025 6:30 PM`పుష్ఫ 3` తరువాత ఇండియా వైడ్‌గా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ `కేజీఎఫ్ చాప్టర్ 3`. `కేజీఎఫ్` సిరీస్‌లో భాగంగా రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఎప్పటికి ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా? రాఖీభాయ్ విళయతాండవ ఎలా ఉండనుందా? అని యష్ అభిమానులే కాకుండా సినీ లవర్స్, మేకర్స్, ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ థియేటర్లలోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` కన్నడతో పాటు మగతా దక్షిణాది భాషల్లోనూ, హిందీలోనూ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించింది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ డ్రామాని కళ్లకు కట్టినట్టు చూపించడం, ఎవరూ ఊహించని నేపథ్యంలో సినిమా రావడంతో కన్నడతో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కోవిడ్‌కు ముందు విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.
రూ.80 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా ఎవరూ ఊహించని విధంగా రూ.250 కోట్ల మేర వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ వరకు యష్ంటే ఎవరో ఎవరికీ తెలియదు. కన్నడలో తప్ప ఇతర దక్షిణాది భాషల్లో యష్ తెలియదు. అయినా సరే ప్రశాంత్ నీల్ చేసిన మ్యాజిక్ కారణంగా యష్ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా క్రేజీ స్టార్ల జాబితాలో నిలిచాడు. ఫస్ట్ పార్ట్ కారణంగా సెకండ్ పార్ట్‌పై భారీ క్రేజ్ ఏర్పడటంతో దీని బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. అంతే కాకుండా రూ.100 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.1250 కోట్లు రాబట్టి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో పార్ట్ 3పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రాఖీ భాయ్ కోసం అమెరికా సీఐఏతో పాటు 16 దేశాలు వెతుకుతున్నాయని పార్ట్ 2 ఎండింగ్‌లో హింట్ ఇవ్వడంతో `కేజీఎఫ్ చాప్టర్ 3`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. బాలీవుడ్ డబ్బింగ్ హక్కుల కోసం భారీ స్థాయిలోక్రేజీ ప్రొడ్యూసర్స్ పోటీపడుతున్నారంటే కేజీఎఫ్ చాప్టర్ 3 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి, థియేటర్లలోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
కారణం ప్రశాంత్ నీల్ రెండు ప్రాజెక్ట్ (డ్రాగన్, సలార్ 2)లని పూర్తి చేసే పనిలో ఉండటం, యష్ కూడా `టాక్సిక్`, `రామాయణ` చిత్రాలతో బిజీగా ఉండటంతో `కేజీఎఫ్ చాప్టర్ 3` మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఈ ఇద్దరు తాము అంగీకరించిన రెండు ప్రాజెక్టలని పూర్తి చేసిన తరువాతే `కేజీఎఫ్ 3`నిఒ పట్టాలెక్కిస్తారని ఇన్ సైడ్ టాక్. అంటే `కేజీఎఫ్ 3` కోసం 2027 వరకు వేచి చూడాల్సిందే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై హోంబలే ఫిల్మ్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.