Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్ -3' లో ఛాన్స్ అడిగిన బ్యూటీ!

ఇదే డౌట్ శ్రీనిధికు వ‌చ్చింది. అందుకే ప్ర‌శాంత్ నీల్ ని క‌లిసిన స‌మ‌యంలో ఈ విష‌యం గురించి అడుగుతూనే ఉందిట‌.

By:  Tupaki Desk   |   27 April 2025 8:30 AM
కేజీఎఫ్ -3 లో ఛాన్స్ అడిగిన బ్యూటీ!
X

'కేజీఎఫ్' ప్రాంచైజీ పాన్ ఇండియాలో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో తెలిసిందే. రెండు భాగాలు భారీ విజ‌యం సాధించి క‌న్న‌డ ఇండ‌స్ట్రీ పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగించింది. దీంతో య‌శ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇండియాలో బిజీ డైరెక్ట‌ర్ అయిపోయారు. కానీ ఇదే సినిమాలో హీరోయిన్ గా న‌టించిన క‌న్న‌డ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం ఆ రేంజ్ లో వెల‌గ‌లేక‌పోయింది.

'కేజీఎఫ్' త‌ర్వాత మ‌రో ఛాన్స్ అందుకోవ‌డానికి నాలుగేళ్లు ప‌టింది. విక్ర‌మ్ హీరోగా న‌టించిన 'కోబ్రా'లో న‌టించింది. అక్క‌డ నుంచి టాలీవుడ్ కి ప్ర‌మోట్ అవ్వ‌డానికి మ‌రో మూడేళ్లు స‌మ‌యం ప‌ట్టింది. ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన 'హిట్ ది థ‌ర్డ్ కేసు'లో న‌టిస్తోంది. 'తెలుసు క‌దా' అనే మ‌రో చిత్రం లోనూ ఛాన్స్ అందుకుంది. ముందుగా 'తెలుసు క‌దా'లోనే ఛాన్స్ అందుకుంది. ఆ త‌ర్వాతే 'హిట్' లో అవ‌కాశం వ‌చ్చింది.

ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే 'కేజీఎఫ్ 3' కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అది ఎప్పుడు ప్రారంభ‌మ వుతుంది? అన్న‌ది తెలియ‌దుకానీ అందులో హీరో య‌శ్ మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాడు. పాత పాత్ర‌ల‌తో పాటు కొన్ని కొత్త పాత్ర‌లు యాడ్ అవుతాయి. ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ మ‌రింత ప్ర‌తిష్టా త్మ‌కంగాను తెరకె క్కిస్తాడు. మ‌రి హీరోయిన్ సంగ‌తేంటి? రెండు భాగాల్లోనూ న‌టించింద‌ని శ్రీనిధిని త‌ప్పించి కొత్త భామ‌ను తీసుకుం టారా? అన్న సందేహం రావ‌డం స‌హ‌జ‌మే.

ఇదే డౌట్ శ్రీనిధికు వ‌చ్చింది. అందుకే ప్ర‌శాంత్ నీల్ ని క‌లిసిన స‌మ‌యంలో ఈ విష‌యం గురించి అడుగుతూనే ఉందిట‌. ఆ మ‌ధ్య ముంబైలో ఓ సినిమా షూట్ సంద‌ర్భంగా య‌శ్ ని క‌లిసిన‌ప్పుడు కూడా ఈ విష‌యం గురించి స‌ర‌దాగా అడిగిందిట‌. కేజీఎఫ్ 2లో నా పాత్ర‌ని చంపేసారు. కేజీఎఫ్ 3 ప్లాన్ ఏంటి? అని అడిగా. మ‌రి ఉన్నానా? లేనా? అన్న‌ది అప్పుడే క్లారిటీ రాదు. అందుకు చాలా స‌మయం ప‌డుతుంద‌ని తెలిపింది.