డెనిమ్ బటన్ విప్పేసి.. టాప్ జిప్ తీసేసి.. కేతిక రచ్చ!
నేటితంలో అందం ప్రతిభతో ఆకట్టుకున్న అందాల కథానాయికలలో కేతికా శర్మ ఒకరు. ఈ భామ పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 19 Jan 2024 9:32 AM ISTనేటితంలో అందం ప్రతిభతో ఆకట్టుకున్న అందాల కథానాయికలలో కేతికా శర్మ ఒకరు. ఈ భామ పరిచయం అవసరం లేదు. ఇటీవలే పవన్ - సాయిధరమ్ ప్రధాన పాత్రలు పోషించిన బ్రో చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. తన చిత్రాలతో పాటు ఫ్యాషన్ ఎంపికలతోను ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ ఉత్తరాది బ్యూటీ.
కేతిక అద్భుతమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ తో సోషల్ మీడియాల్లో దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కేతికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజా పోస్ట్‌లలో కేతిక రెబలియన్ టీజింగ్ లుక్ తో మతులు చెడగొట్టింది. డెనిమ్ ఫ్యాంట్ బటన్స్ పెట్టకుండా వదిలేసిన ఈ బ్యూటీ.. టైట్ బ్లాక్ టాప్ ధరించి జిప్ ని ఓపెన్ చేసింది. ఒక రకంగా కేతిక తన అభిమానులను ఈ కొత్త లుక్ తో టీజ్ చేస్తోందని చెప్పాలి.
కేతికా శర్మ ఈ ఫోటోలను అప్‌లోడ్ చేసిన వెంటనే ఈ బ్యూటీ సహజమైన రూపాన్ని చూసి అభిమానులు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కేతిక అందాన్ని మెచ్చుకోవడానికి కొందరు వ్యాఖ్యల విభాగంలో చేరారు. ``ఆమెను రోజంతా చూడగలిగాను. నిజంగా చాలా అందంగా ఉంది``అని ఒక అభిమాని వ్యాఖ్యానించగా, మరొక అభిమాని, చాలా అందమైన దేవదూత! అని రాశాడు. కేతిక అంతకుముందు మల్టీకలర్ బాడీ హగ్గింగ్ ట్యూబ్ డ్రెస్‌లో మేకప్ లెస్ లుక్ తో కనిపించింది. ఇప్పుడు అందుకు భిన్నమైన రూపంతో ఆకట్టుకుంది.
కేతిక 2021లో `రొమాంటిక్` చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో ఆకాష్ పూరి, రమ్యకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటించారు. పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ యొక్క బ్రో: ది అవతార్ లో కూడా కేతిక కీలక పాత్రలో కనిపించింది. కానీ ఇటీవల కెరీర్ పరంగా ఆశించినన్ని అవకాశాలు రాలేదు.
