Begin typing your search above and press return to search.

వాటితో సరిపెట్టుకుంటున్న రొమాంటిక్ బ్యూటీ..!

సినిమాల్లో ఎలాగు ఛాన్సులు రావట్లేదు కదా అని కెతిక శర్మ తన ఫోకస్ అంతా కూడా ఫోటో షూట్స్ మీద పెట్టింది.

By:  Tupaki Desk   |   16 March 2024 3:30 PM GMT
వాటితో సరిపెట్టుకుంటున్న రొమాంటిక్ బ్యూటీ..!
X

డబ్ స్మాష్ చేస్తూ సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయిన కెతిక శర్మ పూరీ జగన్నాథ్ దృష్టిలో పడింది. పూరీ తననుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కించిన రొమాంటిక్ సినిమాలో అమ్మడు టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో అమ్మడి గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అవ్వగా ఆ వెంటనే నాగ శౌర్య చేసిన లక్ష్య ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా ఛాన్స్ అందుకుంది. చేసిన సినిమాలేవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి చేసిన బ్రో సినిమాలో కూడా తేజ్ లవర్ గా నటించింది కెతిక శర్మ. ఈ సినిమా వల్ల కూడా కెతికకు పెద్దగా లాభం చేకూరలేదు. టాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేసినా సరే ఏ ఒక్క సినిమా కెతిక కెరీర్ కు హెల్ప్ అవ్వలేదు. కేవలం గ్లామర్ రోల్స్ కి తప్ప యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రల్లో ఆమె కష్టమని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే కెతికకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రావట్లేదు.

సినిమాల్లో ఎలాగు ఛాన్సులు రావట్లేదు కదా అని కెతిక శర్మ తన ఫోకస్ అంతా కూడా ఫోటో షూట్స్ మీద పెట్టింది. కెతిక శర్మ గ్లామర్ ఫోటో షూట్స్ ఆమెకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చేలా చేస్తున్నాయి. రకరకాల ఫోజులతో కెతిక చేస్తున్న ఈ ఫోటో షూట్స్ అన్నీ కూడా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉన్నాయి. ఆఫర్లు లేక కేవలం ఫోటో షూట్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని కెతిక గురించి చెప్పుకుంటున్నారు.

చేసిన నాలుగు సినిమాల్లో కెతిక గ్లామర్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేసినా నటన పరంగా మాత్రం ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఈ సినిమాలో కచ్చితంగా కెతిక ఉండాల్సిందే అనేలా ఆమె టాలెంట్ చూపించలేదు. ఇక తనకు బలమైన గ్లామర్ షోలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు అమ్మడు. రోజుకొక ఫోటో షూట్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ కి ఐ ఫీస్ట్ అందిస్తుంది కెతిక శర్మ. ఈ ఫోటో షూట్స్ తప్ప సినిమా అవకాశాలు తెచ్చుకునే పరిస్థితి కనిపించట్లేదని చెప్పొచ్చు. మరి కెతిక కష్టపడి చేస్తున్న ఈ ఫోటో షూట్స్ వల్ల ఏమన్నా లాభం ఉందా లేదా అన్నది చూడాలి.