Begin typing your search above and press return to search.

హమ్మయ్య ఆ హీరోయిన్ హిట్టు కొట్టిందోచ్..!

రొమాంటిక్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన కెతిక శర్మ తెరంగేట్రం చేసిన 4 ఏళ్ల తర్వాత హిట్ అందుకుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 9:30 PM
హమ్మయ్య ఆ హీరోయిన్ హిట్టు కొట్టిందోచ్..!
X

అందాల భామ కెతిక శర్మ ఆకాష్ పూరీ చేసిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అమ్మడు తెలుగు ఆఫర్ అందుకోగానే సూపర్ అనిపించుకుంది. ఐతే రొమాంటిక్ సినిమాలో కెతిక గ్లామర్ షో మెప్పించినా సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఆ తర్వాత అశ్వద్ధామ చేసినా అది తుస్సుమన్నది.

హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే ఆ కథానాయికలకు అవకాశాలు రావడం కష్టం. కెతిక విషయంలో కూడా అదే జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ చేసిన బ్రో సినిమాలో కూడా నటించింది కెతిక. అది కూడా అంతగా కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. ఐతే కెరీర్ డైలమాలో పడిన ఈ అమ్మడు శ్రీవిష్ణు సినిమా ఛాన్స్ అందుకుంది. సింగిల్ అంటూ వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

రొమాంటిక్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన కెతిక శర్మ తెరంగేట్రం చేసిన 4 ఏళ్ల తర్వాత హిట్ అందుకుంది. సింగిల్ సినిమాలో కెతిక లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అమ్మడు కాస్త స్లిమ్ గా మారినట్టుగా ఉంది. అవకాశాల కోసం తమని తాము మార్చుకునే హీరోయిన్స్ కి కచ్చితంగా టాలీవుడ్ లో మంచి ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. రొమాంటిక్ సినిమాతోనే తెలుగు ఆడియన్స్ లో హా**ట్ ఇమేజ్ తెచ్చుకున్న కెతిక ఫైనల్ గా సింగిల్ తో సక్సెస్ రుచి చూసింది.

ఈ సింగిల్ ఇచ్చిన హిట్ జోష్ తో కెతిక ఇక మీదట ఇదే సక్సెస్ ఫాం కొనసాగిస్తుందేమో చూడాలి. సినిమా కథల విషయంలో హీరోయిన్స్ అందరు చేసే తప్పులనే చేస్తూ వచ్చింది కెతిక శర్మ. కేవలం రెండు డైలాగ్స్, 3 పాటల్లో కనిపించే సినిమాలు చేసినా లెక్క పెట్టుకోవడానికి తప్ప కెరీర్ కు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఐతే ఇప్పుడిప్పుడే రియాలిటీని అర్థం చేసుకుంటున్న కెతిక ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సింగిల్ హిట్ జోష్ లో ఉన్న కెతిక ఇదే ఊపులో మరో సినిమా అవకాశం అందుకుని అది కూడా సక్సెస్ కొడితే మాత్రం ఇక అమ్మడికి టాలీవుడ్ కెరీర్ కి ఇబ్బంది ఉండదని ఫిక్స్ అవ్వొచ్చు.