కేతిక శర్మ ప్రయాణం కూడా రాశీఖన్నాలా!
ఇతర భాషల్లో కూడా అవకాశాలు రాకపోవడంతో తిరిగి ముంబై వెళ్లడమే ఆలస్యమన్నట్లు ప్రచారం మొదలైంది.
By: Tupaki Desk | 24 July 2025 4:00 AM ISTఇండస్ట్రీలో హిట్లతో పనిలేకుండా కొంత మంది భామలకు లక్కీగా అవకాశాలు అందుకుంటుంటారు. టాలీ వుడ్ లో కొన్నాళ్ల పాటు రాశీఖన్నా కెరీర్ అలాగే సాగింది. ఎన్ని పరాజయాలు ఎదురైనా అమ్మడు కొత్త అవ కాశాలు అందుకుంటూ సాగింది. ఇలా ఎంత కాలం అంటే? అవకాశాలు వచ్చినంతకాలం సాగుతుంది. అప్పుడప్పుడు యావరేజ్ గా ఆడిన సినిమాలు కూడా లెక్కలోకి రావడంతో కొన్నాళ్ల పాటు బండి లాంగించింది. కానీ ఒక్కసారిగా టాలీవుడ్ లో ఛాన్స్ లు నిల్ అవ్వడంతో తమిళ్, హిందీ అంటూ పర భాషలవైపు కాన్సంట్రేట్ చేసి అటెళ్లింది.
తాజాగా మురో ముంబై బ్యూటీ కేతిక శర్మ కెరీర్ కూడా టాలీవుడ్ లో అలాగే సాగుతున్నట్లు కనిపిస్తుంది. `రొమాంటిక్` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. `లక్ష్య`, `రంగ రంగ వైభవంగా`, `బ్రో`, `రాబిన్ హుడ్` లాంటి పెద్ద చిత్రాలే చేసింది. కానీ ఇవేవి కూడా హిట్ అవ్వలేదు. అయినా సరే అమ్మడు కొత్త అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన `సింగిల్` తో మాత్రం డీసెంట్ హిట్ అందుకుంది. ఈసినిమా అమ్మడికి బూస్టింగ్ లా నిలిచింది.
ఇప్పటి వరకూ కెరీర్ కి హిట్టే లేని భామకు తొలి హిట్ నమోదైంది. ఈ నేపథ్యంలో కేతిక కు కొత్త అవకాశాలు క్యూ కడుతున్నాయనే విషయం లీకైంది. చిన్న నిర్మాతలంతా కేతిక వైపే చూస్తున్నారు. పారితోషికం పరంగానూ ఎలాంటి డిమాండ్ కూడా లేని నేపథ్యంలో నిర్మాతలు సౌకర్యంగా ఫీలవుతున్నారు. యంగ్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఓ ఇద్దరు నిర్మాతలు అడ్వాన్స్ లు చెల్లించి లాక్ చేసినట్లు సమాచారం. దీంతో కేతిక కూడా పుల్ ఖుషీగా ఉన్నట్లు కనిపిస్తుంది.
వరుస పరాజయాల నేపథ్యంలో కేతిక శర్మ కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. ఇతర భాషల్లో కూడా అవకాశాలు రాకపోవడంతో తిరిగి ముంబై వెళ్లడమే ఆలస్యమన్నట్లు ప్రచారం మొదలైంది. సరిగ్గా అలాంటి సమయంలోనే `సింగిల్` విజయం కొండంత భరోసా కల్పించింది. త్వరలోనే అమ్మడు కొత్త ప్రాజెక్ట్ ల వివరాలు వెల్లడించనుందని సమాచారం.
