'సింగిల్స్'తో హాట్ లేడీ ఇక ట్రాక్‌లోకి వచ్చేసినట్టేనా?
అయితే తాజాగా శ్రీవిష్ణుతో కలిసి చేసిన `సింగిల్` రీసెంట్‌గా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 10 May 2025 6:09 AMడబుష్మాష్ వీడియోలతో నెట్టింట పాపులర్ అయిన ఢిల్లీ భామ కేతికశర్మ. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌గా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న కేతిక వెర్సటైల్ డైరెక్టర్ పూరి దృష్టిని ఆకర్షించి తొలి అవకాశాన్ని దక్కించుకుంది. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన `రొమాంటిక్` మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. కానీ తొలి మూవీతో హాట్ బేబీగా గుర్తింపుని తెచ్చుకుందే కానీ హిట్‌ని మాత్రం దక్కించుకోలేకపోయింది. హాటీగా పూర్తి ఎఫర్ట్ పెట్టినా కథ, కథనాలు ఆకట్టుకోలేకపోవడంతో కేతికకు తొలి అడుగులోనే పరాభవం ఎదురైంది.
ఆ తరువాత నాగశౌర్యతో చేసిన `లక్ష్య`, వైష్ణవ్ తేజ్‌తో చేసిన `రంగ రంగ వైభవంగ` కూడా అదే కోలలో చేరి కేతికని తవ్రంగా నిరాశకు గురి చేసింది. పవర్‌స్టార్‌తో కలిసి సాయిధరమ్ తేజ్ చేసిన `బ్రో` కూడా కేతిక కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టలేకపోయింది. అయితే ఇటీవల నితిన్ నటించిన `రాబిన్ హుడ్`లో `అదిదా సర్‌ప్రైజ్` అంటూ ఐటమ్ నంబర్‌లో హీటెక్కించింది. శేఖర్ మాస్టర్ వివాదాస్పద స్టెప్పులతో వార్తల్లో నిలిచింది. సినిమా హిట్ కాకపోయినా కేతికని మాత్రం వార్తల్లో నిలిపేలా చేసింది.
అయితే కేతిక ఐటమ్ నంబర్లకే పరిమితమా? హీరోయిన్‌గా సక్సెస్‌ని దక్కించుకోలేదా? అనే కామెంట్‌లు వినిపించాయి. ఎంతగా ప్రయత్నించినా తనకు కమర్షియల్ విజయం లభించకపోవడంతో కేతిక కూడా కొంత నిరుత్సాహానికి గురైంది. అయితే తాజాగా శ్రీవిష్ణుతో కలిసి చేసిన `సింగిల్` రీసెంట్‌గా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీట్ సమ్మర్‌లో కూల్‌హిట్‌గా నిలిచి శ్రీవిష్ణుతో పాటు కేతికకు, `లవ్ టుడే` ఫేమ్ ఇవానకు మంచి విజయాన్ని అందించింది.
చాలా రోజుల తరువాత కేతిక శర్మకు `సింగిల్`తో సక్సెస్ లభించింది. దీంతో హాట్ లేడీగా పేరు తెచ్చుకున్న కేతిక ఇక ట్రాక్‌లోకి వచ్చేసినట్టేనా? అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న సింగిల్ వసూళ్ల పరంగానూ మంచి ఫిగర్లని నమోదు చేస్తుండటంతో ఇక కేతిక కెరీర్ టర్న్ అయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ తరువాత కేతిక తమిళ డైరెక్టర్ రాజేష్ ఎం.సెల్వ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తోంది. ఇది కూడా హిట్ అనిపించుకుంటే తెలుగులో కేతికకు ఇక తిరుగుండదన్నమాటే.