Begin typing your search above and press return to search.

గ్లామర్ తో కట్టిపడేస్తున్న కేతికా శర్మ..

చాలా రోజుల తర్వాత కేతిక శర్మ మంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   3 Jan 2026 10:23 AM IST
గ్లామర్ తో కట్టిపడేస్తున్న కేతికా శర్మ..
X

ఈ మధ్యకాలంలో కాస్త సమయం దొరికితే చాలు హీరోయిన్స్ వెకేషన్ కి వెళ్తున్నారు. కొంతమంది ఫ్యామిలీతో వెళ్తే మరికొంతమంది సింగిల్ గా వెళ్లి తమ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో వెళ్తూ అక్కడి వీధులు చుట్టేస్తూ మరింత ఆనందాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలామంది షిప్ ప్రయాణం చేస్తూ అక్కడే తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బ్యూటీ కూడా షిప్ లో ప్రయాణిస్తూ తన అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తూ చెమటలు పట్టించింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ కేతిక శర్మ.




తాజాగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె సముద్ర యానం చేస్తూ షిప్ నుండి కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అమ్మడి అందాలకు ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత కేతిక శర్మ మంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేతిక శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కేతిక ఇలా అందాలు ఆరబోయడంతో కామెంట్ బాక్స్ లో అభిమానులు ఫైర్ ఎమోజీలతో నింపేస్తున్నారు.




1995 డిసెంబర్ 24న ఇండియాలోని న్యూఢిల్లీలో జన్మించిన ఈమె చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ డబ్స్ మాష్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈ వీడియోలతోనే దర్శకుల కంట్లో పడి కెరియర్ ను మొదలుపెట్టింది .తొలిసారి 2021లో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకొని.. నటన రంగ ప్రవేశం చేసింది. ఈమె నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆశాజనకంగా నటించింది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.




ఇక అదే ఏడాది నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య అనే సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక 2022లో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభోగంగా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక తర్వాత సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమాలో సాయి ధరంతేజ్ సరసన నటించింది. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్ల సాధించిన ఐదవ చిత్రంగా నిలిచింది. ఇక ఇటీవల రాబిన్ హుడ్, సింగిల్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె విజయ్ 69 మూవీలో కూడా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి