Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : చీర కట్టులో అందాల కేతిక

'రొమాంటిక్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కేతిక శర్మ చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్‌ మీడియా ద్వారా దక్కించుకున్న పాపులారిటీ చాలా ఎక్కువ అనే విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   26 May 2025 10:56 AM IST
పిక్‌టాక్‌ : చీర కట్టులో అందాల కేతిక
X

'రొమాంటిక్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కేతిక శర్మ చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్‌ మీడియా ద్వారా దక్కించుకున్న పాపులారిటీ చాలా ఎక్కువ అనే విషయం తెల్సిందే. ఈమె అందమైన ఫోటో షూట్స్‌, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె చీర కట్టు ఫోటోలతో సందడి చేసింది. గతంలో ఎన్నో సార్లు అందమైన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన కేతిక శర్మ ఈ సారి చీర కట్టు ఫోటోలతో మెప్పించింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌తో ఆకట్టుకునే కేతిక శర్మ రొమాంటిక్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే.


న్యూఢిల్లీలో 1995లో జన్మించిన ముద్దుగుమ్మ కేతిక శర్మ సోషల్‌ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమె చేసిన డబ్స్‌మాష్‌ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. టిక్‌టాక్‌ వీడియోలు, ఇన్‌స్టారీల్స్ కారణంగా ఏకంగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడికి హీరోయిన్‌గా మంచి గుర్తింపు లభించింది. కానీ లక్‌ కలిసి రాకపోవడంతో కమర్షియల్‌ బ్రేక్ దక్కడం లేదు. ఈ అమ్మడు మోడలింగ్‌పై ఆసక్తితో కాలేజ్ పూర్తి అయిన వెంటనే ఆ రంగం వైపు అడుగులు వేసింది. సోషల్‌ మీడియాలో వచ్చిన గుర్తింపు కారణంగా ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకుంది.


2021లో ఆకాష్‌ పూరితో కలిసి రొమాంటిక్ సినిమాలో నటించి రొమాంటిక్ ముద్దుగుమ్మ గా పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాగ శౌర్యతో కలిసి లక్ష్య సినిమాలోనూ నటించింది. తెరపై అందంగా కనిపించడంతో పాటు, సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా కేతిక శర్మ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంటుంది. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెంచుకున్న కేతిక శర్మకు నిరాశ మిగిలింది. దాంతో కేతిక ఆఫర్లు చాలా తగ్గాయి. ముఖ్యంగా కేతిక శర్మ పాత్రల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అనే విమర్శలు వచ్చాయి.


కేతిక శర్మ తాజా ఫోటో షూట్‌లో అందమైన చీరకట్టు ఫోటోలతో మెప్పించింది. సాధారణంగానే ముద్దుగుమ్మలు చీర కట్టులో అందంగా కనిపిస్తూ ఉంటారు. అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. చీర కట్టి హొయలు పోతున్న ముద్దుగుమ్మ కేతిక శర్మ మరోసారి అందంగా కనిపించడం మాత్రమే కాకుండా కవ్వించే చూపులతో మెప్పించింది. చీరకట్టు లో కేతిక శర్మ చూపు తిప్పనివ్వడం లేదు అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ హీరోయిన్‌ ముందు ముందు అయినా సినిమాల్లో బిజీ కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.