కేతిక రాంగ్ టైమ్ లో అడుగుపెట్టిందా?
కేతిక ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లువుతుంది. కానీ ఇప్పటివరకు అమ్మడికి సాలిడ్ హిట్ పడింది లేదు.
By: Tupaki Desk | 7 April 2025 2:00 PM ISTపూరీ జగన్నాధ్ కొడుకు పూరీ ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కేతిక శర్మ ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో పెద్దగా హైప్ తెచ్చుకోలేకపోయింది. కేతిక ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లువుతుంది. కానీ ఇప్పటివరకు అమ్మడికి సాలిడ్ హిట్ పడింది లేదు.
ఇవన్నీ చూస్తుంటే కేతిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టైమ్ కరెక్ట్ కాదనిపిస్తోంది. నాలుగేళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్కటి కూడా సక్సెస్ ఇవ్వకపోవడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆఖరికి కేతిక రీసెంట్ గా రాబిన్‌హుడ్ సినిమాలో చేసిన ఐటెమ్ సాంగ్ కూడా ఆమెకు కోరుకున్న సక్సెస్ ను ఇచ్చి, తన కెరీర్ కు బ్రేక్ ఇవ్వలేకపోయింది.
రొమాంటిక్ సినిమా తర్వాత కేతిక, నాగశౌర్యతో కలిసి చేసిన లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో కలిసి చేసిన రంగ రంగ వైభవంగా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో తన ఆశలన్నీ ఆమె కెరీర్లోనే నటించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన బ్రో సినిమాపై పెట్టుకుంటే ఆ సినిమా కూడా తన ఆశలపై నీళ్లు చల్లుతూ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.
బ్రో సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతలు కేతికను పట్టించుకోవడం మానేశారు. హీరోయిన్ గా పాత్రలు తగ్గిపోవడంతో కేతిక రాబిన్‌హుడ్ లో ఐటెమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సాంగ్ చేసింది. ఆ సాంగ్ లోని కేతిక బోల్డ్ మూవ్స్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అయినప్పటికీ, ఆ సెన్సేషనల్ సాంగ్ కూడా అమ్మడి కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేకపోయింది.
ప్రస్తుతం కేతికే చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే సింగిల్. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో అయినా కేతిక హిట్ అందుకుంటేనే కేతికకు తర్వాత సినిమా అవకాశాలు దక్కుతాయి. అందుకే సింగిల్ పైనే కేతిక తన ఆశలన్నింటినీ పెట్టుకుంది. మరి సింగిల్ సినిమా కేతిక ఆశలను ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.
