పిక్‌టాక్ : కేతిక కవ్వింపుతో బేజారు
హీరోయిన్‌గా ఇన్ని ప్లాప్స్ పడ్డా ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మూడున్నర మిలియన్‌ల కంటే ఎక్కువ మంది ఈమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2025 2:02 PM ISTఆకాష్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్‌లో 2021లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. మొదటి సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా లక్ కలిసి వచ్చి కేతిక శర్మకు ఆఫర్లు వచ్చాయి. అదే ఏడాదిలో లక్ష్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా కూడా కేతిక శర్మ సక్సెస్‌ను సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. లక్ష్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడు 2022లో రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో మెగా హీరోకు జోడీగా నటించడం ద్వారా కచ్చితంగా హిట్ దక్కుతుందని ఆశించింది. కానీ అది కూడా ఫ్లాప్‌గానే మిగిలింది.
సాధారణంగా హీరోయిన్స్ మొదటి సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ కనిపించరు. కానీ లక్కీగా ఈ అమ్మడు వరుసగా మూడు సినిమాలతో ఫ్లాప్‌లను చవిచూసినా కూడా అదృష్టం కలిసి వచ్చింది. ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీ బ్రో లో ముఖ్య పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలిచినా కూడా ఈమెకు ఆఫర్లు పెద్దగా రాలేదు. ఆ సినిమా వల్ల కేతిక కెరీర్‌కి పెద్దగా ప్రయోజనం ఏమీ దక్కలేదు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా అవి కూడా పెద్దగా ఆడలేదు. ఈ ఏడాదిలో రాబిన్‌హుడ్‌తో పాటు సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగిల్ సినిమా మంచి విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో మరిన్న ఆఫర్లు ఈ అమ్మడికి వస్తాయేమో చూడాలి.
ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు తెలుగులో కూడా మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్‌గా ఇన్ని ప్లాప్స్ పడ్డా ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మూడున్నర మిలియన్‌ల కంటే ఎక్కువ మంది ఈమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. దాంతో ఈమె రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఈమె ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. స్కిన్ షో చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
రెడ్ షర్ట్ ధరించి, యాష్ కలర్ టాప్‌లో ఈ అమ్మడు కన్నుల విందు చేసింది. చిట్టి పొట్టి డ్రెస్‌ల్లో ఈ అమ్మడు చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సహజంగానే ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ద్వారా మరింతగా ఈ అమ్మడికి ఫాలోయింగ్ దక్కుతుంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు, మంచి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ద్వారా ఈమె ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈమె కవ్వింపు ఫోటోలు వైరల్ కావడంతో ఇలాంటి ముద్దుగుమ్మను టాప్ స్టార్ హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
