Begin typing your search above and press return to search.

రొమాంటిక్ బ్యూటీకి ఇదే చివరి అవకాశం..!

రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ టాలెంట్ అందరికీ తెలిసిందే. తన డబ్ స్మాష్ వీడియోలతో అలరించిన ఈ బ్యూటీ పూరీ నిర్మించిన రొమాంటిక్ సినిమా ఛాన్స్ అందుకుంది.

By:  Tupaki Desk   |   7 May 2025 5:00 AM IST
Is Ketika Sharma a Star in the Making?
X

రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ టాలెంట్ అందరికీ తెలిసిందే. తన డబ్ స్మాష్ వీడియోలతో అలరించిన ఈ బ్యూటీ పూరీ నిర్మించిన రొమాంటిక్ సినిమా ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాతో ఎంట్రీ బాగానే దొరికినా ప్రాజెక్ట్ అంతగా సక్సెస్ అవ్వలేదు. ఐతే కెతిక గ్లామర్ షోకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. రొమాంటిక్ తర్వాత నాగ శౌర్యతో ఒక సినిమా చేసిన కెతిక ఆ సినిమాతో కూడా ఫెయిల్యూర్ ఫేస్ చేసింది.

రెండు ఫ్లాపులు పడగానే టాలీవుడ్ లో ఛాన్స్ లు రావడం కొద్దిగా కష్టమే. అందుకే కెతిక శర్మ కాస్త వెనకపడింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా కూడా మెప్పించలేదు. తర్వాత సాయి తేజ్ తో బ్రో సినిమా చేసిన ఈ అమ్మడు లేటెస్ట్ గా శ్రీవిష్ణు తో సింగిల్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఇవానా కూడా మరో హీరోయిన్ గా చేసింది.

ఓ పక్క తాను ఎంత గ్లామర్ షో చేసి యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నా కూడా కెతికకు సరైన ఛాన్స్ లు రావట్లేదు. ఐతే శ్రీవిష్ణు సింగిల్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది అమ్మడు. శ్రీవిష్ణు సినిమాలు అన్నీ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. అలాంటి సినిమాలో కెతిక కూడా భాగమైంది.

రీసెంట్ గా నితిన్ చేసిన రాబిన్ హుడ్ సినిమాలో కెతిక స్పెషల్ సాంగ్ చేసింది. అదిదా సర్ ప్రైజు అంటూ సాంగ్ తో అలరించింది కెతిక శర్మ. హీరోయిన్ గానే కాదు ఎలాంటి ఛాన్స్ వచ్చినా వదలకూడదని ఫిక్స్ అయ్యింది అమ్మడు. కెతిక శర్మ లోని గ్లామర్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఎందుకో ఆ అటెంప్ట్ ఎవరు చేయట్లేదు.

కెతిక లాంటి అందాల భామలు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయితేనే తెర మీద గ్లామర్ షోని చూసే ఛాన్స్ ఉంటుంది. రొమాంటిక్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన కెతిక ఇప్పటివరకు సూపర్ హిట్ కొట్టిన సినిమా లేదు. అయినా సరే మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన మెటీరియల్ అయినా కూడా కెతిక ఇప్పటికీ ఇంకా ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. ఐతే రాబోయే రోజుల్లో అయినా అమ్మడికి అలాంటి సూపర్ హిట్ సినిమా పడాలని ఆడియన్స్ కోరుతున్నారు.