కేతికా పాప.. ట్రాక్ లోకి వచ్చినట్లేనా?
కేతికా నటించిన ‘సింగిల్’ సినిమా మే 9 విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ విష్ణు సరసన నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఆమె నటన, గ్లామర్ అందరినీ ఆకట్టుకున్నాయి.
By: Tupaki Desk | 22 May 2025 3:00 AM ISTకేతికా శర్మ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 2016లో ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తన గ్లామర్, నటనతో అభిమానులను ఆకర్షించింది. ‘రంగ రంగ వైభవంగా’, ‘లక్ష్య’ సినిమాల్లో కూడా నటించినప్పటికీ, ఆమె కెరీర్ ఊహించిన స్థాయిలో ఊపందుకోలేదు. చాలా కాలంగా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఆదుకోవాలని చూస్తున్న కేతికాకు సరైన అవకాశాలు రాక, కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయితే, ఇటీవల ఆమె కెరీర్‌లో కొత్త మలుపు చోటుచేసుకుంది.
కేతికా నటించిన ‘సింగిల్’ సినిమా మే 9 విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ విష్ణు సరసన నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఆమె నటన, గ్లామర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్‌తో రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సక్సెస్‌తో కేతికా మరోసారి దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది, ఆమె కెరీర్‌లో కొత్త ఊపిరి లభించినట్లు కనిపిస్తోంది.
లేటెస్ట్ గా కేతికాకు మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. ‘అనార్కలి’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కేతికా తో పాటు మరో హీరోయిన్ కూడా రవితేజ సరసన నటించనున్నట్లు టాక్. సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు. ఈ అవకాశం కేతికా కెరీర్‌లో కీలక మలుపుగా మారనుందని అంటున్నారు.
రవితేజతో సినిమా అవకాశం దక్కడం కేతికాకు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలవనుంది, అలాగే చిత్రంలో కేతికా పాత్ర స్టైలిష్ లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుందని టాక్. ఈ సినిమా కోసం ఆమె ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆమె కసిగా ఉన్నట్లు సమాచారం.
‘సింగిల్’ సినిమా సక్సెస్ తర్వాత కేతికా కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో, వరుస అవకాశాలు వస్తున్నాయి. రవితేజ సరసన నటించే అవకాశం ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా, కేతికా శర్మ కెరీర్ ఇప్పుడు సరైన ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద అమ్మడికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.