ఫైనల్‌గా శ్రీవిష్ణు తనకు లక్కీ ఛార్మ్ అయ్యాడుగా!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు.
By: Tupaki Desk | 17 May 2025 11:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. రాత్రికి రాత్రే బ్లాక్ బస్టర్లని దక్కించుకుని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న వాళ్లున్నారు. ఎన్నేళ్లైనా ఒక్క హిట్ దక్కని వారూ ఉన్నారు. కొంత మంది రెండు మూడు సినిమాల తరువాత సక్సెస్ బాటపడితే కొంత మంది మాత్రం ఆ సక్సెస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది హాట్ లేడీ కేతిక. తను కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లవుతోంది.
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన `రొమాంటిక్` మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ఢిల్లీ సోయగం అంతకు ముందు డబ్‌స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది. అదే పాపులారిటీ కారణంగా పూరి దృష్టిలో పడిన కేతిక `రొమాంటిక్` మూవీతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హీరోయిన్‌గా తనకిదే తొలి సినిమా. ఇది తనకు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. కావాల్సిన గ్లామర్ ఉన్నా, ఎక్స్ పోజింగ్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేకపోయినా కానీ తనని విజయం వరించలేదు.
ఆతరువాత చేసిన `లక్ష్య`, రంగరంగ వూఐభవంగ, బ్రో వంటి సినిమాలు కేతికకు విజయాన్ని అందించలేకపోయాయి. కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా కేతికకు సక్సెస్ అందని ద్రాక్షగా మారి దోబూచులాడుతోంది. సక్సెస్ కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న కేతిక కల హీరో శ్రీవిష్ణు కారణంగా తాజాగా నెరవేరింది. శ్రీవిష్ణుతో కలిసి కేతిక నటించిన లేటెస్ట్ మూవీ `సింగిల్`. మే 9న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు ఈ సినిమా రూ.15 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కెరీర్ ఇక కష్టమేనా అనుకున్న సమయంలో కేతికకు హిట్ ఇచ్చిన శ్రీవిష్ణు ఆమె కెరీర్‌కు ప్లస్ అయ్యాడు. ఆమె పాలిట లక్కీ ఛార్మ్‌గా మారాడు. దీంతో కేతిక కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ఈ సినిమా తరువాత కేతిక క్రేజ్ పెరుగుతుందని, వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు తనని వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అన్నట్టుగా కేతిక `సింగిల్` తరువాత తమిళ దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది.