Begin typing your search above and press return to search.

కేతిక పాప.. ఘాటైన గ్లామర్ తో స్టన్నింగ్

ఇప్పటి వరకు కేతిక చేసిన ఏ సినిమా మంచి హిట్టు అందుకోలేకపోయింది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 12:10 PM GMT
కేతిక పాప.. ఘాటైన గ్లామర్ తో స్టన్నింగ్
X

కేతిక శర్మ.. గ్లామర్ విషయంలో ఈ బ్యూటీకి పేరు పెట్టాల్సిన పని లేదు. టాలీవుడ్ కి పరిచయం అయ్యి చాలా కాలమే అవుతుంది. అయితే ఆమె అందానికి ఈపాటికి స్టార్ హీరోయిన్ కావాల్సింది కానీ, అదృష్టం కలిసిరాక ఇంకా మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. అమ్మడికి నటనలోనూ మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు కేతిక చేసిన ఏ సినిమా మంచి హిట్టు అందుకోలేకపోయింది. అయితే బ్యూటీ ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూపులతోనే కాలం గడిపేస్తోంది.


సినిమా అవకాశాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది. గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక ఆమె తన గ్లామర్ ను హైలెట్ చేస్తూ ఫాలోవర్స్ ని ఊరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా కూడా కొన్ని నెవ్వర్ బిఫోర్ అనేలా ఫోటోలు షేర్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా అమ్మడు రెడ్ కలర్ డ్రెస్సులో ఘాటైన అందాలతో మెస్మరైజ్ చేసింది.


ఇక ఫోటోల్లో కేతిక అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. కెమేరాను విభిన్న యాంగిల్స్ లో పెట్టి ఫోటోలు తీశారని అనిపిస్తుంది. ఇక ఆ ఫోటోలన్నింటినీ షేర్ చేసింది. ఫ్యాన్స్ ఆ ఫోటోలు చూసి ఫోటోలో చూస్తుంటేనే సోషల్ మీడియా వేడెక్కిపోతోందని కొందరు నాటీ కామెంట్స్ కూడా చేస్తుండటం విశేషం.


ఇక కేతిక టాలీవుడ్ కి పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకర్షించింది. కానీ, ఆ మూవీ ప్లాప్ కావడంతో, పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అనంతరం మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా', నాగ శౌర్యతో ‘లక్ష్య’లో నటించింది. అవి కూడా క్లిక్ కాలేదు.


తాజాగా బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ కూడా పెద్దగా క్లిక్ కాలేదు. ప్రస్తుతం అయితే బ్యూటీ చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు. ఆ మధ్య ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమాతో ఛాన్స్ వచ్చిన గాసిప్స్ వచ్చాయి. కానీ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు. మరి అమ్మడు ఈ తరహా గ్లామర్ తో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.