Begin typing your search above and press return to search.

సుహాస్ మూవీలో 'కేశవ'.. కలిసొచ్చేనా?

అయితే ఆ డైలాగ్ చెప్పిన ఫ్రెండ్ ఎవరో కాదు.. పుష్ప కేశవ. ఈ మూవీలో సుహాస్ కు క్లోజ్ ఫ్రెండ్ గా జగదీశ్ నటించినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 6:36 PM GMT
సుహాస్ మూవీలో కేశవ.. కలిసొచ్చేనా?
X

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న సుహాస్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. గతేడాది రైటర్ పద్మభూషణ్ చిత్రంతో అంతకు మించిన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా కూడా హిట్టవడంతో ఆయన రేంజే మారిపోయింది. సుహాస్ ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహాస్ సరసన శివాని నాగారం హీరోయిన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఆసక్తి పెంచాయి. ఇక ట్రైలర్ అయితే ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఎమోషనల్ గాను కనెక్ట్ అయ్యేలా ఉంది. సుహాస్ హీరోగా మరో సినిమా అంటే కచ్చితంగా బాగుంటుందని ముందే సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు సినీ ప్రియులు.

అయితే ట్రైలర్ లో "మావోడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినబడుద్ది" అని హీరో ఫ్రెండ్.. హీరోయిన్ తో చెప్పగానే " అలాగైతే అక్కడ పెళ్లికి ఇక్కడి నుంచి కొడతావా" అంటూ శివాని కౌంటర్ డైలాగ్ ఆకట్టుకుంది. అయితే ఆ డైలాగ్ చెప్పిన ఫ్రెండ్ ఎవరో కాదు.. పుష్ప కేశవ. ఈ మూవీలో సుహాస్ కు క్లోజ్ ఫ్రెండ్ గా జగదీశ్ నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో అతడి డైలాగులతోపాటు ప్రెజెన్స్ చూస్తుంటే జగదీశ్ పాత్రకు స్కోప్ ఎక్కువే ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే జగదీశ్.. కొన్నిరోజుల క్రితం ఓ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఓ జూనియర్‌ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్‌ ను పంజాగుట్ట పోలీసులు గతేడాది డిసెంబర్ లో అరెస్ట్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు జగదీశ్. మల్లేశం మూవీ నుంచి సినిమాల్లో ఉన్నా.. అతడికి పేరు తెచ్చింది మాత్రం పుష్ప మూవీనే. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆ తర్వాత సత్తి గాని రెండు ఎకరాలు అనే ఓటీటీ మూవీలో హీరోగా నటించాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, పుష్ప2తో పాటు మరికొన్ని ఆఫర్స్ అందుకున్నాడు. కానీ ఇంతలోనే అరెస్టయ్యాడు. అయితే అరెస్ట్ కు ముందే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లోని అతడి పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి గుర్తింపు అందిస్తుందో చూడాలి.