Begin typing your search above and press return to search.

వార్2 కోసం వారిని రంగంలోకి దింపుతున్న డైరెక్ట‌ర్

అయితే ఇప్పుడీ కాంబినేష‌న్ మ‌రోసారి క‌లిసింది. అయాన్ ముఖ‌ర్జీ తాజా సినిమా వార్2 కోసం వీరంతా క‌లిసి మ‌రోసారి వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీరంతా క‌లిసినట్టు తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 July 2025 1:30 PM IST
వార్2 కోసం వారిని రంగంలోకి దింపుతున్న డైరెక్ట‌ర్
X

అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ్ర‌హ్మాస్త్ర సినిమా గురించి ప్రతీ ఒక్క‌రికీ తెలిసిందే. ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ గా కూడా నిలిచింది. అందులోని కేస‌రియా సాంగ్ యావ‌త్ భార‌త‌దేశాన్నే ఓ ఊపు ఊపేసింది. రిలీజైన టైమ్ లోనే కాకుండా ఇప్ప‌టికీ ఆ సాంగ్ ను వింటూనే ఉంటారు.

ఇన్‌స్టంట్ చార్ట్‌బ‌స్ట‌ర్ గా నిలిచిన కేస‌రియా

ఆర్జిత్ సింగ్ పాడిన ఈ పాట‌కు అమితాబ్ భ‌ట్టాచార్య సాహిత్యం అందించ‌గా, ప్రీత‌మ్ ఆ పాట‌ను కంపోజ్ చేశారు. కేస‌రియా సాంగ్ సూప‌ర్ హిట్ అవ‌డంతో వారి కాంబో చాలా సెన్సేష‌న్ గా మారింది. అయితే ఇప్పుడీ కాంబినేష‌న్ మ‌రోసారి క‌లిసింది. అయాన్ ముఖ‌ర్జీ తాజా సినిమా వార్2 కోసం వీరంతా క‌లిసి మ‌రోసారి వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీరంతా క‌లిసినట్టు తెలుస్తోంది.

భారీ బ‌డ్జెట్ తో వ‌స్తున్న వార్2

అయాన్ ముఖ‌ర్జీ ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ వార్ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాలో హృతిక్ కు జోడీగా కియారా అద్వానీ న‌టిస్తుండ‌గా, య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ఈ స్పై యూనివ‌ర్స్ ఫిల్మ్ ను భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన విష‌యం తెలిసిందే.

మరోసారి రంగంలోకి కేస‌రియా టీమ్

వార్2 సినిమా ఆగ‌స్ట్ 14న రిలీజ్ కానుండ‌గా ఇప్ప‌టికే ఆ సినిమా ట్రైల‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇదిలా ఉంటే వార్2 లోని ఓ డ్యూయెల్ సాంగ్ కోసం కేస‌రియా సాంగ్ టీమ్ ను రంగంలోకి దించారు అయాన్ ముఖర్జీ. వార్2లోని ఓ డ్యూయెట్ సాంగ్ కోసం ప్రీత‌మ్, ఆర్జిత్ సింగ్, అమితాబ్ భ‌ట్టాచార్య క‌లిసి వ‌ర్క్ చేస్తున్నారు.

త్వ‌ర‌లోనే వార్2 ఫ‌స్ట్ లిరిక‌ల్

వార్2 లో హృతిక్, కియారా మ‌ధ్య ఉన్న ప్రేమ‌ను గొప్ప‌గా చూపించే సాంగ్ గా దీన్ని తెరకెక్కించార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేసి వార్2 పై ఉన్న అంచ‌నాలను మ‌రింత పెంచాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. వార్2 నుంచి రిలీజయ్యే మొద‌టి సాంగ్ ఇదేన‌ని అంటున్నారు. మ‌రి ఈ సాంగ్ కూడా కేస‌రియాలానే సూప‌ర్ హిట్ అయి, ఆల్ టైమ్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.