స్టార్ హీరో సినిమాను భయపెడుతున్న ప్లాప్ మూవీ
బాలీవుడ్ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 14 April 2025 3:52 PM ISTబాలీవుడ్ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా కరోనా తర్వాత హిందీ ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లాలి అంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి, అంతే కాకుండా సినిమా ది బెస్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఐదు సంవత్సరాల కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో దాదాపుగా 95 శాతం సినిమాలు నిరాశ పరిచాయి. రెండు శాతం సినిమాలు పర్వాలేదు అనిపించుకంఉటే రెండు శాతం సినిమాలో హిట్ టాక్ సొంతం చేసుకుంటే, ఒక్క శాతం సినిమాలు మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచాయి. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి.
ఇలాంటి సమయంలో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు సైతం ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి, అందులో కనీసం 25 శాతం కూడా వసూళ్లు సాధించలేక పోతున్నాయి. ఎక్కువ శాతం సినిమాలు ఓటీటీ మార్కెట్‌పై ఆశలతో రూపొందుతున్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమా పర్వాలేదు అనే టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రమే వచ్చాయి. త్వరలో హిందీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కేసరి' చాప్టర్ 2 సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ముందు వచ్చిన పార్ట్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
'కేసరి 2' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడికి రెడీ అయింది. మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అనుమానాలు మొదలు అయ్యాయి. అందుకు కారణం 'అకాల్' అనే పంజాబీ మూవీ. 1840 నాటి కథతో రూపొందిన అకాల్ సినిమాలో సర్దార్ అకాల్ సింగ్, అతడి గ్రామంలోని ప్రజలు జాంగీ జహాన్ నేతృత్వంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కరణ్ జోహార్ నుంచి వచ్చిన సినిమా కావడంతో మొదట అంతా ఆసక్తిని కనబర్చారు. కానీ సినిమా విడుదల తర్వాత మొత్తం పరిస్థితి తలకిందులు అయింది. చారిత్రాత్మక సినిమాలను రూపొందించడం అంత ఈజీ కాదు, అంతే కాకుండా ఆ సినిమాలతో మెప్పించడం అంత సులభం కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అకాల్ ఫలితం కారణంగా అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి' సినిమా ఫలితంపై పలువురు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా చారిత్రాత్మక సినిమాలకు ఈరోజుల్లో మంచి ఆధరణ ఉంది. ఛావా సినిమాతో ఆ విషయం నిరూపితం అయింది. కానీ మేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవడంతో పాటు, అన్ని విధాలుగా సినిమా మేకింగ్ విషయంలో జాగ్రత్తలు పెట్టాలి. మరి కేసరి 2 సినిమా విషయంలో ఏం జరిగింది అనేది తెలియాలి అంటే కచ్చితంగా సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
