'ది కేరళ స్టోరీ 2' కు లైన్ క్లియర్!
ఆదా శర్మ నటించిన వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ'. దీని రిలీజ్ టైమ్‌లో ఎన్ని వివాదాలు తలెత్తాయో అంతకు మించిన వివాదాలు, ట్విస్ట్‌లు దీనికి సీక్వెల్‌గా రూపొందిన 'ది కేరళ స్టోరీ 2' చుట్టూ జరుగుతున్నాయి.
By: Ravindar Gorantla | 27 Feb 2026 10:25 PM ISTఆదా శర్మ నటించిన వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ'. దీని రిలీజ్ టైమ్‌లో ఎన్ని వివాదాలు తలెత్తాయో అంతకు మించిన వివాదాలు, ట్విస్ట్‌లు దీనికి సీక్వెల్‌గా రూపొందిన 'ది కేరళ స్టోరీ 2' చుట్టూ జరుగుతున్నాయి. ఈ మూవీ టీజర్‌పై వివాదం తలెత్తడంతో సినిమా రిలీజ్‌పై స్టే విధిస్తూ కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఇక థియేటర్లలోకి రావడం కష్టమనే సందేహాలు వ్యక్తమయ్యాయి. సీబీఎఫ్‌సీ తీరును తప్పుబడుతూ పునఃపరిశీలించాలని ఆదేశించింది.
అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర బృందం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. దీంతో `ది కేరళస్టోరీ 2` రిలీజ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సినిమా రావడం కష్టమేనని సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. రిలీజ్‌కు ముందే వివాదాలు చుట్టుముడుతున్న ఈ వివాదాస్పద చిత్రాన్ని కామాఖ్య నారాయణ్ సింగ్ రూపొందించారు.
ఫస్ట్ పార్ట్‌ని నిర్మించిన విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ మాయలో పడి కొందరు అమ్మాయిలు కన్నవాళ్లని ఎదిరించి ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటారు. అలా వెళ్లినా వారి జీవితాల్లో ఆ తరువాత ఏం జరిగింది? ఎలాంటి మలుపులు తిరిగింది? ..ప్రేమ పేరుతో వారిని ఎలాంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ..దీని వెనుకున్న అసలు రాకెట్ ఏంటీ? హిందుల అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ లవ్ జీహాద్ పేరిట సాగిస్తున్న మారణహోమం కేరళలో ఏ స్థాయిలో జరుగుతోంది? వంటి విషయాలని ఈ సినిమాలో చూపించబోతున్నారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ దగ్గరి నుంచే దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారి వివాదాల్లో చిక్కుకుంటోంది. కోర్టు కేసుల నేపథ్యంలో రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. హైకోర్టు రిలీజ్‌పై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీ కోసం భారీ స్థాయిలో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఊరట లభించి సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఆదా శర్మ నటించిన మూవీ వివాదాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. దీనికి కొనసాగింపుగా రిలీజ్ అవుతున్న `ది కేరళ స్టోరీ 2` అదే మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందా అన్నది మరి కొన్నా గంటల్లో తేలబోతోంది.
