Begin typing your search above and press return to search.

కీర్తి బేబీ ఇంతలా మారిపోయిందేంటి..

తాజాగా తన స్నేహితులతో కలిసి ఆమె వీకెండ్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోల ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   15 July 2023 11:03 AM GMT
కీర్తి బేబీ ఇంతలా మారిపోయిందేంటి..
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె తన అందం, నటన తో ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల దసరా సినిమా లో వెన్నెల పాత్రలో అదరగొట్టింది. డీ గ్లామర్ లుక్ లో కూడా అందంగా కనిపించింది. ఆమె అందానికీ, నటన కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ పాత్రలో కీర్తి కాకుండా మరెవరూ ఇంత అద్భుతంగా నటించరేమో అన్నట్లుగా నటించింది. ఇక ఈ దసరా మూవీ రూ.100కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది.


కాగా, కీర్తి సోషల్ మీడియా లోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోల ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన స్నేహితులతో కలిసి ఆమె వీకెండ్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోల ను షేర్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో , మెస్సీ హెయిర్ తో ఉన్న ఫోటోని తన అభిమాను లతో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఆమె ముంబయి లోని ఓ రెస్టారెంట్ లో కలిసి ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోల ను షేర్ చేసింది. వీకెండ్ వైబ్స్ అంటూ క్యాప్షన్ పెట్టింది. కాగా, దీని పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 'చందమామ ఆకాశం లో ఉందని రాకెట్ వేసుకొని వెళ్తున్నారు. కానీ నా చందమామ ముంబయి లో ఉంది' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టడం విశేషం.

అయితే, ఈ ఫోటోల్లో కీర్తి కొంచెం క్లీవేజ్ షో చేయడం గమనార్హం. అది కొందరికి బాగా నచ్చగా, కొందరు మాత్రం దాని ని విమర్శించడం గమనార్హం. తాము పాత కీర్తిని మిస్ అవుతున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు కీర్తి, చాలా కష్టపడి ఈ స్థాయికి ఎదిగింది అంటూ ఆమె గొప్పతానన్ని కీర్తిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కీర్తి చిరంజీవి భోళా శంకర్ లో నటించింది. ఆమె చిరుకి సోదరి పాత్రలో నటించారు. ఈ మూవీ వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో వైపు నాగ చైతన్య కొత్త సినిమా లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం.